Jakkampudi Vijaya Lakshmi
-
వైఎస్ఆర్సీపీ అధ్వర్యంలో ఈనెల 25న మహిళస్వరం
-
ఎమ్మెల్యే అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తా
-
కొండను అక్రమంగా తవ్వుతున్నారు
-
అవినీతి బాబుకు రక్షణ కవచం అవసరమా!
సీతానగరం (రాజానగరం): రాష్ట్రంలో అవినీతి మారాజుగా పేరొందిన చంద్రబాబుకు ప్రజల రక్షణ కవచం అవసరమా అని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విరుచుకుపడ్డారు. మంగళవారం సీతానగరంలో ప్రజా సంకల్ప యాత్రపై పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిశారు. విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబులో భయాందోళనలు ప్రారంభమయ్యాయని, తాను చేసిన రూ.లక్షలాది కోట్ల దోపిడీకి కేంద్రం లెక్కలు చెప్పాలని అడగడంతో చంద్రబాబు భయాందోళనలో ఉన్నారన్నారు. అలాగే ఓటుకు నోటు కేసు ఎక్కడ విరుచుకుపడుతుందోనని ఆందోళనలో ఉన్నారని, అందుకే ఎక్కడ సభలు, సమావేశాలు పెట్టినా ప్రజలను రక్షణ కవచంగా ఉండాలని అడుగుతున్నాడన్నారు. రాష్ట్ర ప్రజలకు ఏమి చేశావని నీకు రక్షణగా ఉండాలని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో వందలాది హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయని ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. అవినీతి ఆకాశాన్ని తాకింది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి ఆకాశాన్ని అంటిందన్నారు. ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు, ఇప్పుడు ఎయిర్ ఏషియా కుంభకోణంలో బుక్కయ్యారని అన్నారు. ఎయిర్ ఏషియా కుంభకోణంలో చంద్రబాబు పేరు ప్రస్తావన, కుంభకోణానికి సంబంధించి ఆడియో టేపులు తమ వద్ద ఉన్నాయని ప్రముఖ ఆంగ్ల పత్రిక బిజినెస్ టుడే ప్రకటించడంతో చంద్రబాబు అవినీతి ఎల్లలు దాటిందని ఆక్షేపించారు. కుంభకోణాలు, అవినీతి బయట పడడంతో చంద్రబాబుకు మానసిక ఆందోళన, భయాందోళన, మానసిక స్థితి బాగాలేదని ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థం అవుతోందన్నారు. తను చేసిన తప్పును మరిచి ఎమ్మెల్యేలను కొంటారా అని బీజేపీని నిలదీయడం, ప్రజలు రక్షణ కవచంగా ఉండాలనడం చంద్రబాబుకు జైలుకు వెళ్లిపోతానని తెలిసిపోయిందన్నారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజలకు భరోసా కల్పిస్తుందని, ప్రజలు తమ కష్టాలు చెప్పుకోడానికి పాదయాత్ర మంచి అవకాశంగా ప్రజలు భావిస్తున్నారని, అందుకే ప్రజలు జగన్మోహన్రెడ్డికి పాదయాత్రలో బ్రహ్మరథం పడుతున్నారని గుర్తు చేశారు. జిల్లాలోకి ప్రవేశించే జగన్మోహన్రెడ్డికి ఎప్పుడు ఘన స్వాగతం పలుకుదామా అని జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్‌బాబు, పార్టీ నాయకులు వలవల రాజా, చల్లమళ్ల సుజీరాజు, వలవల వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు చెబితే సంకెళ్లా?
రాజమహేంద్రవరం సిటీ: ఏళ్ల తరబడి చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న అన్ ఎయిడెడ్ అధ్యాపకులు, తమ సమస్యలు చెప్పుకోవాలని ప్రయత్నిస్తే.. ప్రభుత్వం వారి గొంతు నొక్కేందుకు ప్రయత్నించడం దారుణమని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసెంబ్లీ దండాలు’ పేరుతో అన్ ఎయిడెడ్ అధ్యాపకులు శుక్రవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం తలపెట్టారు. దీనికి బయలుదేరుతున్న సుమారు 62 మందిని వన్‌టౌన్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీసీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి హుటాహుటిన స్టేషన్‌కు చేరుకుని, అన్ ఎయిడెడ్ అధ్యాపకులకు సంఘీభావం తెలిపారు. వన్‌టౌన్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి వారిని సొంత పూచీకత్తులపై విడిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అన్ ఎయిడెడ్ అధ్యాపకుల సమస్యలను వినే ప్రయత్నం చేయకుండా, అరెస్టు చేయడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు అద్దం పడుతోందన్నారు. అన్ ఎయిడెడ్ స్టాఫ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సంజీవరావు మాట్లాడుతూ, ఎయిడెడ్ స్టాఫ్ కోసం ప్రభుత్వం ఏటా రూ.60 కోట్లు మంజూరు చేస్తోందని, అవి ఖర్చు కాకపోవడంతో వేరే కార్యక్రమానికి మళ్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిడెడ్ సిబ్బందికి మంజూరు చేసిన నిధులను అన్ ఎయిడెడ్ సిబ్బంది కోసం వినియోగిస్తే సమస్య పరిష్కారమవుతుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బొంతా శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
స్కామ్‌ల బాబూ... మీరా నీతులు చెప్పేది
సీతానగరం (రాజానగరం): స్కామ్‌ల బాబూ...మీరా నీతులు చెప్పేది.. నీపై ఉన్న ఆరోపణలపై సీబీఐ ఎంక్వైరీ వేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి సీఎం చంద్రబాబుకు హితవు పలికారు. శుక్రవారం సీతానగరంలో ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొన్న జక్కంపూడి విజయలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ ప్యారడైజ్ పేపర్లంటూ తనకు అనుకూలమైన పత్రికల్లో రాయించుకొని ... వాటి ఆధారంగా చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్రజా సంకల్పం యాత్రలో జగన్ విసిరిన సవాల్‌కు చంద్రబాబు దిమ్మతిరిగిందన్నారు. జగన్‌లో చిత్తశుద్ధి ఉంది కాబట్టే సవాల్ విసిరారని, మరి మీరు చేసిన స్కామ్‌లపై సీబీఐ విచారణకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. విదేశాలలో అక్కౌంట్లు ఉన్నది తండ్రీ, కొడుకులకేనని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల అంచనాలు పెంచే స్కామ్, జన్మభూమి కమిటీ స్కామ్, వేసవి మజ్జిగ పేరుతో, చంద్రన్న కానుక, సదావర్తి భూముల్లో అవినీతి, రాజధాని, ఇసుక, పుష్కరాల్లో, బొగ్గు కొనుగోలు, పోలవరం, పట్టిసీమ ఇలా ఏ రంగం తలుచుకున్నా అందందే అవినీతి తన్నుకొస్తోందని అన్నారు. ఓటుకు నోటు స్కామ్‌తో హైదరాబాద్ వదిలి అమరావతి వచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన స్కామ్‌లపై సీబీఐతో విచారణ చేయిస్తే చంద్రబాబు, లోకేష్, మంత్రులు జైలుకు వెళతారని వివరించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కైవసం చేసుకుంటున్నారని, భాధితులకు న్యాయం చేయకుండా కాకమ్మ కథలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్‌బాబు, పార్టీ నాయకులు వలవల రాజా, చల్లమళ్ల సుజీరాజు, వలవల వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు -
వైఎస్‌ను ఇంతలా అవమానిస్తారా?
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం): ‘పాలకులు మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుతుంటాయని తెలుసు. అయితే వారు వేసిన శిలాఫలకాలు కూడా మారిపోతాయా? దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదికవి నన్నయ యూనివర్సిటీకి భూమిపూజ చేసిన సమయంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని యూనివర్సిటీ ప్రాంగణంలో ఎక్కడా లేకుండా చేయడంలో అర్థం ఏమిట’ని యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడిని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజ మహేంద్రవరం సిటీ కోఆర్డినేటర్ రైతు సూర్యప్రకాశరావు నిలదీశారు. ఈ శిలాఫలకం విషయం తనకు తెలియదన్న వీసీ.. అప్పటినుంచి పనిచేస్తున్న కొంతమంది యూనివర్సిటీ అధికారులను పిలిచి వాకబు చేశారు. అప్పట్లో వీసీగా ఉన్న జార్జివిక్టర్ ఆదేశాల మేరకు 2012లో ఆ పైలాన్‌ను తొలగించారని, శిలాఫలకాన్ని ఏం చేశారో తెలియదని వారు వివరించారు. దీనిపై స్పందించిన వీసీ అసలు శిలాఫలకాన్ని తొలగించడం సరికాదని అన్నారు. ఇంతవరకు తన దృష్టికి ఈ విషయం రాలేదని, పూర్తి వివరాలు ఇస్తే వెంటనే శిలాఫలకాన్ని తయారుచేయించి పెట్టిస్తానని ఆయన హామీ ఇచ్చారు. బ్లాకులకు వైఎస్, జక్కంపూడి పేర్లు పెట్టాలి యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి, జక్కంపూడి రామ్మోహనరావు పేర్లను యూనివర్సిటీలో రెండు బ్లాకులకు పెట్టాలని, ఉద్యోగాలలో స్థానికులకు కూడా అవకాశం ఇవ్వాలని విజయలక్ష్మి కోరారు. వాణిజ్య కార్యకలాపాలకు కూడా టెండర్లు పిలిచి పార్టీలకు అతీతంగా అనుమతులు ఇవ్వాలన్నారు. ఇలా బయటపడింది... ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు సోమవారం యూనివర్సిటీకి రావడంతో 2009లో మాజీ సీఎం వైఎస్ భూమిపూజ చేసిన శిలాఫలకం విషయం వెలుగులోకి వచ్చింది. ప్రాంగణంలో ఎక్కడా ఆ శిలాఫలకం లేకపోవడాన్ని గమనించిన వైఎస్సార్సీసీ శ్రేణుల ద్వారా విషయాన్ని జక్కంçపూడి, రౌతు తదితరులు ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం కార్పొరేటర్ బొంతా శ్రీహరి, తోకాడ సర్పంచి గండి నానిబాబు, వైఎస్సార్ సీపీ నాయకులు దేశాల శ్రీను, జక్కంపూడి జగపతి, తిక్కిరెడ్డి హరిబాబు, దూలం పెద్ద, కొల్లి వీర్రాజు, ఆకుల శ్రీను, ప్రగడ గోవిందు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి జక్కంపూడి అభీష్టం మేరకు.. రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు మూడు యూనివర్సిటీలను మంజూరు చేశారు. వాటిలో ఒకటైన నన్నయ యూనివర్సిటీని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేశారు. అప్పటి ఆర్అండ్బీ శాఖ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు అభీష్టం మేరకు 2009 ఫిబ్రవరి 28న వైఎస్ భూమిపూజ చేశారు. ఆ సమయంలో ఏర్పాటు చేసిన శిలాఫలకం జాతీయరహదారికి చేర్చి ఉండడంతో 2011లో యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ శిలాఫలకంతో పైలాన్ నిర్మించారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో నిర్వహిస్తున్న యూనివర్సిటీని క్రమేణా ఈ ప్రాంగణంలోకి తరలించడంతో అభివృద్ధి పనులతో పాటు ఈ పైలాన్‌ను కూడా ఎవరూ పట్టించుకోలేదు. -
నువ్వా.. జగన్‌ను విమర్శించేది!
సీతానగరం (రాజానగరం): ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు సహకరించిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు.. తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించడమేమిటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మండిపడ్డారు. మండలంలో శనివారం జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె విలేకర్లతో మాట్లాడారు. అసెంబ్లీలో ఎన్టీఆర్‌ను మాట్లాడకుండా చేసి, ఆయన చావుకు కారణం వారిద్దరే అయ్యారని అన్నారు. కాంగ్రెస్‌లో ఓడిపోయినా పిలిచి పదవి ఇస్తే, ఎన్టీఆర్ పార్టీని, జెండా గుర్తును లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అని.. అలాగే స్పీకర్ పదవి ఇస్తే అసెంబ్లీలో ఎన్టీఆర్‌ను మాట్లాడనీయకుండా అవమానించిన వ్యక్తి యనమల అని అన్నారు. వారిని అసెంబ్లీలో చూడలేకే ఎన్టీఆర్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారని గుర్తు చేశారు. తమ పార్టీ టిక్కెట్టుపై గెలిచిన 20 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనడమే కాకుండా.. వారిలో నలుగురిని మంత్రులుగా చేసి అసెంబ్లీలో కూర్చోబెట్టి, వారిచేతే సమాధానాలు ఇప్పించే పరిస్థితి సృష్టించి, ప్రజాస్వామ్యంతో పరిహాసమాడుతున్న చంద్రబాబు వైఖరిని నిరసిస్తూనే జగన్మోహన్రెడ్డి అసెంబ్లీకి రాకూడదని నిర్ణయించారన్నారు. జగన్మోహన్రెడ్డి విలువలతో కూడిన రాజకీయనేత అని, చంద్రబాబు విలువలను భ్రష్టు పట్టించే వ్యక్తి అని అన్నారు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చని అబద్ధాలకోరు చంద్రబాబు అని విమర్శించారు. జగన్ పాదయాత్రతో టీడీపీలో గుబులు ఏర్పడిందన్నారు. జగన్‌ను ఎంతమంది విమర్శించినా పాదయాత్ర కొనసాగుతుందని విజయలక్ష్మి స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్‌బాబు, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి చల్లమళ్ళ సుజీరాజు తదితరులు పాల్గొన్నారు. -
అవినీతి అనకొండ చంద్రబాబు
♦ నగరపాలక సంస్థలో అవినీతి కనపడడం లేదా? ♦ మేయర్ భర్త ఆరోపణలు వినపడలేదా? ♦ జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజం సాక్షి, రాజమహేంద్రవరం : అవినీతి అనకొండ అయిన సీఎం చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు, అధికారులు చేస్తున్న అవినీతి కనపడడం లేదని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు, రాజానగరం కో ఆర్డినేటర్ జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజమెత్తారు. ఈ మేరకు గురువారం ఆమె ప్రకటన విడుదల చేశారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని మేయర్ భర్త, టీడీపీ నేత పంతం కొండలరావు విలేకర్ల సమావేశంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసినా సీఎంకు వినపడలేదా? పత్రికల్లో కనపడలేదా? అని ప్రశ్నించారు. పైగా అవినీతిని సహించబోమని, ఎవరైనా అధికారులు పని చేయడానికి డబ్బులు అడిగితే తనకు ఫిర్యాదు చేయాలని చంద్రబాబు కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇసుకపై ఎవరి పెత్తనం సహించనంటూ ఒకవైపు కల్లబొల్లి మాటలు చెబుతూనే.. రాష్ట్ర వ్యాప్తంగా తన పుత్రరత్నంతో అధికారపార్టీ నేతల ఆధ్వర్యంలో నడుస్తున్న ఇసుక మాఫియా నుంచి రోజువారీ మామూళ్లు వసూలు చేయిస్తున్నారని ఆరోపించారు. మూడేళ్లలో నగరపాలక సంస్థ నగరంలో ఏం అభివృద్ధి చేసిందని మేయర్ భర్త ప్రశ్నించారని, దానికి స్థానిక టీడీపీ ప్రజా ప్రతినిధులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
బెదిరింపులకు భయపడం
చంద్రబాబు ప్రభుత్వ తీరుపై జక్కంపూడి ధ్వజం మధురపూడి (రాజానగరం) : చంద్రబాబు ప్రభుత్వం బెదిరింపులకు వైఎస్సార్ సీపీ బెదరదని పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. శనివారం విలేకర్లతో మాట్లాడుతూ, లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి గెలవాలని ఆమె సవాల్ విసిరారు. అధికార పార్టీ నాయకత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. సోషల్ మీడియా పోస్టింగ్‌ల పేరిట హైదరాబాద్‌లోని కార్యాలయంలోకి పోలీసులు దౌర్జన్యంగా చొరబడడాన్ని జక్కంపూడి తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీసులు చట్టానికి ప్రతినిధులుగా వ్యవహరించాలన్నారు. వైఎస్సార్సీపీ పార్టీ కార్యక్రమాలతో అధికార పార్టీ నాయకత్వానికి చెమటలు పడుతున్నాయన్నారు. ప్రజాసమస్యలపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి నిరంతరం పోరాడుతున్నారన్నారు. రాష్ట్రంలోని సమస్యలపై ప్రజలు సోషల్ మీడియా ద్వారా వ్యతిరేకించడంతో బెంబేలెత్తిపోతుందన్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ వైఎస్సార్సీపీకి ప్రజల ఆదరణ పెరుగుతుండడంతో చంద్రబాబు, లోకేష్ తదితరులకు ఏమిచేయాలో అర్థం కాక దౌర్జన్యాలకు దిగారన్నారు. -
బాధితుల ఆక్రందనలు
వైఎస్సార్ సీపీ నేతల పరామర్శ ఆలమూరు : కోరుమిల్లిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న డ్వాక్రా మహిళలపై పోలీసులు లాఠీచార్జి చేసి ఆలమూరుకు తరలించారు. దీంతో బాధితుల ఆక్రందనలతో పోలీసుస్టేషన్ మార్మోగింది. సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి శేషుబాబ్జీ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.కృష్ణవేణితో పాటు మరో 45 మంది మహిళలను స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళ కానిస్టేబుళ్లను సెక్యూరిటీ ఇచ్చి ఆటోలపై మహిళలను పలు ధపాలుగా తరలించారు. వీరిలో కొంతమందికి గాయాల పాలైనా పోలీసులు పట్టించుకోకపోవడంతో విలపిస్తున్నారు. వివరాలు తెలుసుకున్న వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు కర్రి పాపారాయుడు, మండపేట నియోజకవర్గ ఇన్చార్జి వేగుళ్ల పట్టాభిరామన్న, జిల్లా యూత్ నాయకులు దూలం వెంకన్నబాబు తదితరులు స్థానిక పోలీసు స్టేషన్‌కు వచ్చి బాధిత మహిళలను పరామర్శించారు. పలువురు మహిళలు కోరుమిల్లిలో పోలీసులు చేసిన దౌర్జన్యాన్ని, తగిలిన గాయాల్ని వైఎస్సార్సీపీ నాయకులకు వివరించారు. గాయపడ్డ వారిని రాజమండ్రి ఆస్పత్రికి తరలించాలని వైఎస్సార్సీపీ నేతలు పోలీసులను డిమాండ్ చేశారు. మహిళలపై పోలీసులను ప్రయోగించి భయభ్రాంతులకు గురిచేస్తున్న టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని వేగుళ్ల లీలాకృష్ణ, సిరిపురపు శ్రీనివాసరావు, ఏ.చంద్రరావు, టి.ప్రసన్నకుమార్ తదితరులు వ్యాఖ్యానించారు. అయితే ఈకేసుకు సంబంధించి సీపీఎం, సీఐటీయూ నాయకులతో పాటు డ్వాక్రా మహిళలపై 353 సెక్షన్ క్రింద నాన్ బెయిల్ బుల్ కేసు నమోదైంది. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని సీపీఎం, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శులు శేషుబాబ్జీ, కృష్ణవేణి అన్నారు. అధికార పార్టీ నాయకుల సూచనల మేరకే పోలీసు శాఖ ముందే ప్రణాళికను సిద్ధం చేసి అరెస్ట్ పర్వానికి తెర తీసిందని వారు ఆరోపించారు. -
రైతులను మోసం చేస్తున్న బాబు
కోరుకొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ధ్వజమెత్తారు. సోమవారం కోరుకొండ మండల పరిషత్ కార్యాలయం వద్ద మండల కన్వీనర్ చింతపల్లి చంద్రం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ప్రజావాణి సదస్సు నిర్వహిస్తున్న ఎంపీడీఓ ఈ.మహేశ్వరరావు, మండల వ్యవసాయాధికారి కె.శ్రీనివాస్‌లను రైతు రుణమాఫీపై నిలదీశారు. ప్రభుత్వంతో పాటు అధికారులు కూడా రైతులతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీఓకు అందజేశారు. రైతులనుద్దేశించి విజయలక్ష్మి మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ పూర్తిగా చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు నేడు సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. రుణమాఫీ కోసం రైతులు బ్యాంకు అకౌంట్లు, ఆధార్, రేషన్‌కార్డులు, పొలం సర్వే నంబర్లు జిరాక్స్ కాపీలు వ్యవసాయశాఖ, బ్యాంకు, రెవెన్యూ అధికారులకు ఇచ్చినా చాలా మందికి రుణమాఫీ కాలేదన్నారు. బ్యాంకు వద్దకు వెళ్తే ఆధార్‌కార్డు లేదు, రేషన్‌కార్డు లేదు అంటూ రైతులను ఇబ్బందిపెడుతున్నారని ధ్వజమెత్తారు. రైతులకు న్యాయం చేయక పోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పార్టీ మండల, గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు చింతపల్లి చంద్రం, తోరాటి శ్రీను, వైఎల్ఎన్ స్వామి, యడ్ల సత్యనారాయణ, కల్యాణం చిట్టిబాబు, కాలచర్ల శివాజీ, వాకా నరసింహారావు, అరిబోలు చినబాబు, అత్తిలి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కొండను దొలిచేస్తున్నా పట్టడం లేదు
కోరుకొండ : మండలంలోని కనుపూరు శివారు గ్రామంలో ప్రభుత్వ కొండ భూములను అధికార పార్టీకి చెందిన కొందరు అక్రమంగా తవ్వేస్తున్నారని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. శనివారం ఆమె కోరుకొండలో మాట్లాడుతూ కొండను తవ్వేస్తున్నారని తహశీల్దార్, ఎంపీడీఓ, మైన్స్ డిపార్ట్మెంట్ అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇంటి ముందు ఉన్న పల్లం భూమిని పూడ్చడానికి కొండ మట్టిని తవ్వితే కేసులు రాస్తున్న అధికారులు అధికార పార్టీ వారికి మాత్రం కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు. పంచాయతీలో పలు అక్రమాలు జరిగినా చర్యలు లేవన్నారు. గామంలో పనులు చేయకుండానే పనులు చేసినట్టు బిల్లులు తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మండలస్థాయి అధికారుల తీరు పై తీవ్రంగా ధ్వజమెత్తారు. వీటన్నింటిపైన మంగళవారం ఉదయం గ్రామంలో పాదయాత్ర చేపడతామన్నారు. వైఎస్సార్ సీపీ కనుపూరులో నెలకొన్న సమస్యల పై ఆందోళన చేపడుతుందన్నారు. ఈమె వెంట వైఎస్సార్ సీపీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు కళ్యాణం చిట్టిబాబు, జాజుల నాగేశ్వరరావు, కళ్యాణం రాంబాబు, కొత్తపల్లి శ్రీనివాస్, అడపా సురేంద్ర తదితరులు ఉన్నారు. -
బొడ్డు, జక్కంపూడిలను గెలిపించండి
సాక్షి, రాజమండ్రి: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని అభిమానించే ప్రతి ఒక్కరూ రాజానగరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి జక్కంపూడి విజయలక్ష్మికి, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి బొడ్డు వెంకటరమణ చౌదరికి ఓటేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచార కార్యక్రమం ‘వైఎస్సార్ జనభేరి’లో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న ఆమె ఆదివారం కోరుకొండ బస్టాండ్‌సెంటర్‌లో జరిగిన సభలో మాట్లాడారు. మహానేత మరణానంతరం తమ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ కష్టాలపాల్జేసిన తరుణంలో జక్కంపూడి కుటుంబం తమకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. దుశ్శాసన పాలనకు చరమగీతం అంతకుముందు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ తొమ్మిదేళ్ల దుశ్శాసన, దుర్యోధన, దుర్వినీతి పాలనకు చరమగీతం పాడి రాజశేఖరరెడ్డి రాష్ట్రానికి సుపరిపాలన అందిం చారన్నారు. ఆయన మరణానంతరం ప్రజలు మళ్లీ దుర్మార్గపు పాలన చవిచూశారన్నారు. రాజన్న తెచ్చిన సువర్ణయుగం మళ్లీ తీసుకు వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి నడుం కట్టారని పేర్కొన్నారు. తాను జైల్లో ఉండి కూడా రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు ఆమరణ దీక్ష చేసిన నేతను మన మందరం గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ఇది ధర్మయుద్ధం ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ధర్మయుద్ధం అని ఎంపీ అభ్యర్థి బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. జగన్మోహన్రెడ్డిని జైల్లో ఉంచి, విజయమ్మను అసెంబ్లీ సాక్షిగా కన్నీరు పెట్టించిన దుష్టపరిపాలనపై సాగుతున్న పోరాటమిదని అన్నారు. జగనన్న వదిలిన బాణం షర్మిలకు తోడుగా కార్యకర్తలు, అభిమానులు లక్షలాది, కోట్లాది బాణాలై ఆయనను అధికారంలోకి తేవాలని కోరారు. పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి, పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్, బొల్లిన సుధాకర్, మునగాడ ఫణి, అరకు పార్లమెంటు అభ్యర్థి కొత్తపల్లి గీత, రాజమండ్రి కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి ఎం. షర్మిలా రెడ్డి పాల్గొన్నారు. -
విభజన నిర్ణయం చారిత్రక తప్పిదం
ధవళేశ్వరం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు కేంద్రం తీసుకున్న నిర్ణయం చారిత్రక తప్పిదమని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. ధవళేశ్వరం లూథరన్ హైస్కూల్ గ్రౌండ్లో పార్టీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు అధ్యక్షతన ఆదివారం సాయంత్రం జరిగిన సమైక్య శంఖారావం సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రతో పాటు తెలంగాణ ప్రాంత ప్రజలు నష్టపోతారన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రం సమైక్యంగా ఉండటంతో పాటు సువర్ణ పాలన లభిస్తుంద ని అన్నారు. పార్టీ సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ కేంద్రానికి విస్తృత అధికారాలు ఉంటే ప్రమాదమన్న విషయాన్ని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆనాడే చెప్పారన్నారు. హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని కూడా ఆయన చెప్పారన్నారు. ప్రస్తుతం కేంద్రం ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించాలని చూస్తోందన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే డెల్టా తీవ్రంగా నష్టపోతుందన్నారు. విద్యార్థులు, ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందన్నారు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి మాట్లాడుతూ కుట్రలతో జైలు గోడల మధ్య బంధించినా సమైక్య రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష చేపట్టిన ఏకైక నాయకుడు జగన్మోహన్రెడ్డేనని అన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ పార్లమెంట్, అసెంబ్లీలలో కాంగ్రెస్, టీడీపీ నాయకుల ద్వంద్వ వైఖరి బయటపడిందన్నారు. వివిధ పార్టీల మద్దతు కూడగట్టి రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఆకుల వీర్రాజు మాట్లాడుతూ సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ వైఎస్సార్సీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్లు బొమ్మన రాజ్‌కుమార్, రెడ్డి ప్రసాద్, విప్పర్తి వేణుగోపాలరావు, మిండగుదిటి మోహన్, వివిధ విభాగాల కన్వీనర్లు శెట్టిబత్తుల రాజబాబు, రెడ్డి రాధాకృష్ణ, కర్రి పాపారాయుడు, గారపాటి ఆనంద్, యువనేత జక్కంపూడి రాజా, నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి, యాదల సతీష్‌చంద్ర స్టాలిన్, సుంకర చిన్ని, ఆదిరెడ్డి వాసు, ఎన్.వసుంధర, ఇసుకపల్లి శ్రీనివాస్, రావూరి వెంకటేశ్వరరావు, అజ్జరపు వాసు తదితరులు పాల్గొన్నారు.