
ఉప్పల్‌లో 'జన్ ఔషధి' ఏర్పాటు
వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం
న్యూఢిల్లీ: ఉప్పల్ ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ సెంటర్‌లో త్వరలో రూ. 2.5 లక్షలతో జన్ ఔషధి మందుల దుకాణం ప్రారంభించనున్నట్టు కేంద్ర రసాయన, ఎరువుల శాఖ సహాయమంత్రి హన్సరాజ్ గంగారామ్ ఆహిర్ తెలిపారు. దేశవ్యాప్తంగా జన్ ఔషధి పథకం ఏర్పాటు, దాని లక్ష్యాలను తెలియజేయాలంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. కొన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా మందుల పంపిణీ లేకపోవడంతో జన్ ఔషధి పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.