సమైక్య శంఖారావంలో వైఎస్సార్ సీపీ నేతలు
గన్నవరం, న్యూస్‌లైన్ : రాష్ట్ర సమైక్యత కోసం ఆహర్నిశలు పాటుపడుతున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవాలని ఆ పార్టీ గన్నవరం, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల సమన్వయకర్తలు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, ఉప్పులేటి కల్పన, సింహద్రి రమేష్ పిలుపునిచ్చారు.
పార్టీ కార్యాలయం ఆవరణంలో ఆదివారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ సమైక్య శంఖారావం సభ జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులనుద్దేశించి వారు మాట్లాడుతూ....రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాగల సత్తా, సామర్థ్యం కేవలం జగన్‌కు మాత్రమే ఉందన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జగన్ జాతీయస్థాయిలో పెద్దఎత్తున పోరాటం చేస్తుంటే, కాంగ్రెస్, టీడీపీలు మాత్రం రెండు కళ్ల సిద్ధాంతంతో కళ్లబోల్లి మాటలు చెబుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యంధ్రా ముసుగులో విభజనకు సహాకరిస్తుంటే, చంద్రబాబు మాత్రం ఉసరవల్లిలా రంగులు మారుస్తూ విభజనపై స్పష్టమైన ప్రకటన చేయకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని విమర్శించారు. శాసనసభలో టి-బిల్లుపై చర్చకు దూరంగా ఉంటూ ఇరు ప్రాంతాలకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలను రెచ్చగొడుతూ బాబు చేస్తున్న కుటీల రాజకీయాలను రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలను రాష్ట్ర ప్రజలు భూస్థాపితం చేయడం ఖాయమని హెచ్చరించారు. రానున్న కాలంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ముందుకు నడిపించే శక్తి జగన్‌కు మాత్రమే ఉందని ప్రజలందరూ విశ్వసిస్తున్నారని చెప్పారు.
పార్టీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గొసుల శివభరత్‌రెడ్డి, కాసర్నేని గోపాలరావు, కోటగిరి వరప్రసాదరావు, యార్కరెడ్డి నాగిరెడ్డి, తోట వెంకయ్య, ఆరుమాళ్ళ సాంబిరెడ్డి, ఎండీ. గౌసాని, కందిమాళ్ళ శ్రీనివాసరావు, కొల్లి రాజశేఖర్, మేచినేని బాబు, వింతా శంకరరెడ్డి, సూరం విజయకుమార్, సర్పంచి నీలం ప్రవీణ్‌కుమార్, పార్టీ నాయకులు చిమటా శ్రీనివాసరావు, నెరుసు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జననేత జగన్‌కే సాధ్యం
Published Mon, Dec 23 2013 12:44 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement