నలభై రోజులపాటు శాసనసభలో చర్చ జరిగాక విభజన బిల్లును తిప్పిపంపాలన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నోటీసుపై సీపీఎం మండిపడింది.
హైదరాబాద్ : నలభై రోజులపాటు శాసనసభలో చర్చ జరిగాక విభజన బిల్లును తిప్పిపంపాలన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నోటీసుపై సీపీఎం మండిపడింది. బిల్లుపై..కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు సభలోనే గ్రూపులు కట్టడం హైకమాండ్ వ్యూహమని సీపీఎం ఫ్లోర్ లీడర్ జూలకంటి రంగారెడ్డి మండిపడ్డారు. సభలో గందరగోళ పరిస్థితిని సృష్టించి రాజకీయ లబ్ది పొందేందుకు కాంగ్రెస్ పన్నిన కుట్రలో ఇది భాగమని ఆయన అన్నారు. తక్షణం బీఏసీని ఏర్పాటు చేసి, సభ సజావుగా సాగేలా చూడాలని జూలకంటి డిమాండ్ చేస్తున్నారు.