8న వైఎస్‌ఆర్ జయంతి వేడుకలు
విజయనగరం మున్సిపాలిటీ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రా జశేఖరరెడ్డి జయంతి ఉత్సవాన్ని ఈ నెల 8న భారీగా నిర్వహిస్తున్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోలగట్ల వీరభద్రస్వామి ఆదివారం తెలిపారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు స్థానిక రాజీవ్ క్రీడామైదానం లో మెగా రక్తదాన శిబిరంతో పాటు, వరుణ యాగం నిర్వహిస్తామని ఆ యన పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లా రక్తనిల్వల కొరత ఉన్నందున, ఆ రో జున పార్టీ నాయకులు, కార్యకర్తలతో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పా టు చేస్తామని వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో, దేశంలో నెలకొన్న అనావృష్టి నేపథ్యంలో వర్షాలు కురిసి అన్నదాతలో పాటు అన్ని వర్గాల ప్ర జలు సుఖ శాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ వరుణయాగాలు నిర్వహిస్తామన్నారు. ఆ రోజు నిర్వహించే రెండు కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.