ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
రాజమండ్రి, న్యూస్‌లైన్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ సదస్సు శుక్రవారం రాజమండ్రిలోని చెరుకూరి కల్యాణ మండపంలో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ స్వలింగ సంపర్కుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి గేలకు మద్దతు లభించిందని, అదే కోల్‌కతాలో ఒక వైద్యుడిపై ఒక రోగి వేసిన కేసులో రూ.7 కోట్లు చెల్లించాల్సి వస్తే ప్రజల నుంచి మద్దతు లభించలేదని చెప్పారు. జస్టిస్ రమణ మాట్లాడుతూ అత్యాధునిక వైద్యం కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితమైందన్నారు. నిష్ణాతులైన వైద్యులున్నా సౌకర్యాలులేక గ్రామాల్లో పూర్తిస్థాయి వైద్యం అందించలేకపోతున్నారన్నారు. వైద్య విధానాల్లో వస్తున్న మార్పులపై పలువురు వైద్యులు మాట్లాడారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం, జీఎస్‌ఎల్ మెడికల్ కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
పట్టణాలకే పరిమితమైన అత్యాధునిక వైద్యం
Published Sat, Dec 28 2013 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
Advertisement