Justice Ramana
-
దుర్గమ్మ సన్నిధిలో సీజేఐ దంపతులు
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సతీసమేతంగా శనివారం ఉదయం దర్శించుకున్నారు. తొలుత ఆలయం వద్ద రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖమంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వారికి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ మర్యాదలతో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ పైలా సోమినాయుడు, కార్యనిర్వహణాధికారి భ్రమరాంబ, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతించారు. అంతరాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాన్ని అందజేశారు. సీజేఐ వెంట ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కన్నెగంటి లలిత, ఏపీ, తెలంగాణ హైకోర్టుల రిజిస్ట్రార్లు, విజయవాడ ఎంపీ కేశినేని నాని, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్‌లాల్, కలెక్టర్ జె. నివాస్, పోలీస్ కమిషనర్ కాంతిరాణా తదితరులు ఉన్నారు. -
చంద్రబాబు అంతరంగిక కాపలాదారు ఆయనే
జస్టిస్ బీఎస్ఏ స్వామి. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఓ ఫైర్ బ్రాండ్. దళిత, బలహీన వర్గాల్లో ఎంతో పేరున్న ఆయన హైకోర్టులో కులత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. పదవీ విరమణ తర్వాత 2005లో ‘ఎ క్యాస్ట్ క్యాప్చర్ ఏపీ జుడీషియరీ’ పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. అందులో ప్రధానంగా ఏపీ హైకోర్టు రాజకీయాలను ప్రస్తావించారు. జస్టిస్ ఎన్వీ రమణ, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి మధ్య ఉన్న బాంధవ్యాన్ని, న్యాయ వ్యవస్థలో రాజకీయ జోక్యాన్ని స్పష్టంగా వివరించారు. ఆ పుస్తక ప్రతులను రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలందరికీ పంపించారు. అప్పట్లో ఈ పుస్తకం ఓ సంచలనం రేపింది. ఇందులో చంద్రబాబు, జస్టిస్ రమణల గురించి ఆయన రాసిన వివరాలు యథాతథంగా ఇలా ఉన్నాయి. సాక్షి, అమరావతి: నారా చంద్రబాబునాయుడు అంతరంగిక కాపలాదారు జస్టిస్ ఎన్వీ రమణ. చంద్రబాబుకు, ఈ పెద్ద మనిషి (ఎన్వీ రమణ)కి మధ్య ఉన్న ఆ బాంధవ్యం ఏంటో మాకెవ్వరికీ తెలియదు. వాస్తవానికి చంద్రబాబు.. ఎన్వీ రమణను రాజ్యసభకు పంపాలనుకున్నారు. కానీ అదనపు అడ్వొకేట్ జనరల్‌ను చేశారు. న్యాయమూర్తిగా నియమితులయ్యే వరకు అదనపు ఏజీ హోదాలో ఆయనేమీ పెద్ద కేసుల్లో వాదనలు వినిపించింది లేదు. ఆల్మట్టి కేసుల్లో రాష్ట్రానికి ఆయన ఎలాంటి న్యాయ సేవలు అందించారో అందరికీ తెలుసు. చంద్రబాబు-జడ్జీలకు మధ్య రమణ అనుసంధానకర్త చంద్రబాబునాయుడుకు, హైకోర్టు జడ్జీలకు మధ్య జస్టిస్ రమణ లైజనింగ్ చేసేవారు. న్యాయమూర్తుల అవసరాలను చూసుకునేవారు. పదవీ విరమణ తర్వాత పోస్టులిస్తామని ఆశ చూపేవారు. తద్వారా చంద్రబాబు ప్రయోజనాలకు విరుద్ధంగా ఎలాంటి ఉత్తర్వులు రాకుండా చూసేవారు. జస్టిస్ ఎన్వీ రమణ ఆమోదం లేకుండా న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఏ ఫైలును కూడా చంద్రబాబు క్లియర్ చేసేవారు కాదు. అది న్యాయమూర్తుల నియామకం కావొచ్చు.. న్యాయాధికారుల నియామకం కావొచ్చు.. ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయ సలహాదారుల నియామకం కావొచ్చు. ఆశావహులంతా ఆయన ఇంటి ముందు, ఆయన ఛాంబర్ ముందు క్యూలో నిలబడేవారు. సీనియర్ న్యాయమూర్తులు కూడా ఆయన చెప్పినట్లు ఆడేవారు. ఆయన ఛాంబర్లో వారంతా ముచ్చట్లాడుకునేవారు. జస్టిస్ ఎన్వీ రమణ హీనమైన రాజకీయాలతో న్యాయ మూర్తులు రెండు వర్గాలుగా విడిపోయారు. సుప్రీంకోర్టు ఓసారి రమణ పేరును తిరస్కరించింది.. హైకోర్టు న్యాయమూర్తి పోస్టుకు జస్టిస్ ఎన్వీ రమణ పేరును జస్టిస్ బెనర్జీ సిఫారసు చేశారు. అప్పటికి ఎన్వీ రమణ వయస్సు 42 సంవత్సరాలు. అయితే బెనర్జీ సిఫారసును సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత జస్టిస్ వర్మ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పులు జరిగాయి. ఈ మార్గదర్శకాలను అడ్డంపెట్టుకుని, మళ్లీ సిఫారసులు అవసరం లేకుండా చంద్రబాబునాయుడు, ఎన్వీ రమణలు పాత సిఫారసులనే పునరుద్దరించేలా మేనేజ్ చేశారు. దీంతో జస్టిస్ ఆనంద్ హయాంలో రమణ హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు. అటు చంద్రబాబు, ఇటు రమణలు జస్టిస్ ఆనంద్‌తో మంచి సంబంధాలు నెరిపారు. న్యాయమూర్తుల ఖాళీలు ఉన్నప్పటికీ, వాటిని భర్తీ చేసేందుకు తాజా పేర్లను సిఫారసు చేయకుండా అప్పటి హైకోర్టు సీజే జస్టిస్ లిబరహాన్ను ప్రభావితం చేశారు. మళ్లీ పేర్లు వెళితే, అందులో తన పేరు ఉన్నప్పటికీ.. వయసు రీత్యా మిగిలిన వారి కంటే తాను జూనియర్‌గా ఉంటానన్న భావనతో జస్టిస్ ఎన్వీ రమణ ఇదంతా చేశారు. అప్పుడు జస్టిస్ ఎన్వీ రమణే డీఫాక్టో సీజే ఎస్బీ సిన్హా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నంత కాలం డీఫాక్టో ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణే. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను కాపాడే రక్షకుడిగా ఉన్నారు. ఆయన హయాంలో రమణ మాటే వేదవాక్కు. న్యాయవాది బి.ఆదినారాయణరావుకు సీనియర్ హోదా ఇచ్చేందుకు కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉన్నా, జస్టిస్ సిన్హా ఆ పని చేయలేదు. సీనియర్ న్యాయవాది హోదా కోసం ఆదినారాయణరావు చేసుకున్న దరఖాస్తును జస్టిస్ రమణ కోరిక మేరకు తిరస్కరించడానికే అలా చేశారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఎస్బీ సిన్హా, జస్టిస్ ఏఆర్ లక్ష్మణన్, జస్టిస్ దేవీందర్గుప్తాలు చంద్రబాబునాయుడుకు నమ్మినబంటు అయిన జస్టిస్ రమణ చెప్పినట్లు ఆడేవారు. వీరంతా కలిసి ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన కేసులను తన వద్ద నుంచి తీసేశారని జస్టిస్ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సీవై సోమయాజుల కోటరీ అండతో పలువురు ప్రధాన న్యాయమూర్తులు నన్ను ఎలా వేధింపులకు గురి చేశారన్న విషయాలను నేను ప్రస్తావించదలచుకోలేదు. జస్టిస్ రమణను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవీందర్గుప్తా రంగారెడ్డి జిల్లా పోర్ట్‌పోలియో జడ్జిగా నియమించారు. ఈ జిల్లాలో భూ లావాదేవీలు కోట్ల రూపాయల్లో ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే రోహిణిని జడ్జిని చేశారు.. చంద్రబాబు కోసం జస్టిస్ ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన ప్రతి ప్రధాన న్యాయమూర్తిని ప్రలోభపెట్టేవారు. అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలో తమకున్న పలుకుబడిని ఉపయోగించి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని చేస్తామని వారికి ఆశ చూపేవారు. ప్రభా శంకర్ మిశ్రా మినహా పలువురు ప్రధాన న్యాయమూర్తులు ఈ ఇద్దరి ఎర కోసం వలలో చిక్కుకుని, వారు చెప్పినట్లు ఆడేవారు. వాస్తవానికి న్యాయవాది ఎన్.శోభ హైకోర్టు న్యాయమూర్తి అవుతారని న్యాయవాదులందరూ భావించారు. అయితే ఎన్వీ రమణ మాత్రం ఈమె జడ్జి అయితే తన తోకగా ఉండరన్న ఉద్దేశంతో జస్టిస్ రోహిణిని న్యాయమూర్తి చేశారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిబరహాన్ మొత్తం నలుగురి పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేశారు. అందులో పీఎస్ నారాయణది మొదటి పేరు కాగా, రోహిణిది చివరి పేరు. ఆశ్చర్యకరంగా ఆ నలుగురిలో కేవలం ఈ రెండు పేర్లు మాత్రమే క్లియర్ అయ్యాయి. ఇలా ఎందుకు జరిగిందనేది ఇప్పటికీ ఓ మిస్టరీనే. ఆ తర్వాత మిగిలిన రెండు పేర్లు కూడా ఆమోదం పొందాయి. అంతిమంగా జస్టిస్ రోహిణి మిగిలిన ఇద్దరి కంటే సీనియర్ అయ్యారు. వాస్తవానికి రోహిణి కంటే మిగిలిన ఇద్దరు కూడా వయస్సులో పెద్దవారు. జస్టిస్ ఎన్వీ రమణ న్యాయ వ్యవస్థ ప్రయోజనాల కోసం పనిచేసి ఉంటే, పరిస్థితులు చాలా బాగుండేవి. కానీ న్యాయ వ్యవస్థ తలరాత మరోలా ఉంది. -
సమస్యలపై సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలి
-
ప్రాథమిక స్థాయి నుంచే న్యాయ సాయం
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయం అర్థించే వారికి ప్రాథమిక స్థాయి నుంచే న్యాయ సహాయం అందాలని జాతీయ న్యాయ సేవల అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్ని రాష్ట్రాల న్యాయ సేవల సంస్థల ఎగ్జిక్యూటివ్ చైర్మన్లు, సభ్య కార్యదర్శులకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘పోలీస్ స్టేషన్‌కు హాజరవ్వాల్సి వచ్చినప్పటి నుంచే న్యాయ సహాయార్థులకు న్యాయ సేవలు అందించాలి. సరైన సమయంలో అప్పీలు దాఖలు చేయడం, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీలు, సుప్రీం కోర్టు లీగల్ సర్వీస్ కమిటీలతో సమన్వయం చేసుకోవడం, బెయిల్ అప్లికేషన్ అవసరమైన వారిని గుర్తించడం, వారికి న్యాయ సేవలు అందించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలి’ అని పేర్కొన్నారు. శిక్ష పడిన వారికి న్యాయ సేవలు అందించే దిశగా ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో నల్సా ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రమంగా అన్ని రాష్ట్రాలకు దీనిని విస్తరించాలని నిర్ణయించారు. నేర బాధితులకు న్యాయ సహాయం అందించాలన్న మరో ముఖ్యమైన అంశంపైనా చర్చించారు. 2020లో ఐదు జాతీయ లోక్ అదాలత్‌లను నిర్వహించనున్నట్టు వివరించారు. ఫిబ్రవరి, ఏప్రిల్, జూలై, సెప్టెంబర్, డిసెంబర్ రెండో శనివారం ఈ అదాలత్‌లను నిర్వహిస్తారు. -
నల్సా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా జస్టిస్ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సీనియారిటీలో రెండో స్థానంలో ఉన్న జస్టిస్ నూతలపాటి వెంకట రమణ జాతీయ న్యాయ సేవల సంస్థ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈమేరకు భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నియమించినట్టు కేంద్ర న్యాయ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 27 నుంచే ఈ నియామకం వర్తిస్తుందని ఉత్తర్వులో పేర్కొంది. ఇప్పటి వరకు జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు. అట్టడుగు వర్గాలు, వెనకబడిన వర్గాలకు నిష్పాక్షికమైన, అర్థవంతమైన న్యాయం అందించే లక్ష్యంగా సమీకృత న్యాయ వ్యవస్థను ప్రోత్సహించేందుకు 1987లో నల్సాను స్థాపించారు. జస్టిస్ ఎన్.వి.రమణ సుప్రీం కోర్టు లీగల్ సర్వీస్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా(ఎస్సీఎల్ఎస్సీ) కూడా ఉన్నారు. ఆయన పదవీ కాలంలో ఎస్సీఎల్ఎస్సీలో పెండింగ్ కేసులు తగ్గాయి. జనవరి 2018 లో 3,800 కేసులు ఉండగా.. ఆగస్టు 2019 నాటికి 1811కు తగ్గాయి. నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జస్టిస్ ఎన్.వి.రమణ శుక్రవారం జామ్‌నగర్ హౌజ్‌లోని నల్సా కార్యాలయం సందర్శించారు. నల్సా డైరెక్టర్ సునీల్ చౌహాన్, ఇతర అధికారులతో చర్చించారు. న్యాయ సేవలు అందించడంలో సమర్థతను, న్యాయ సేవలు పొందగలిగే అవకాశాలను పెంపొందించడంపై చర్చించారు. నల్సా భవిష్యత్తు కార్యక్రమాలకు మార్గదర్శకంగా జస్టిస్ ఎన్.వి.రమణ ఒక విజన్ స్టేట్మెంట్ను ఆవిష్కరించారు. లీగల్ సర్వీసెస్ క్లినిక్స్ సమర్థవంతంగా పనిచేసేలా చూడడం, డిజిటైజేషన్ చేయడం, న్యాయ సేవలు పొందడంలో ప్రొటోకాల్ రూపొందించడం వంటి కార్యక్రమాలపై నల్సా దృష్టిపెట్టనుంది. -
స్త్రీలకు ప్రత్యేక న్యాయ శాఖ: జస్టిస్ రమణ
♦ అప్పుడే వారి సమస్యలకు సత్వర పరిష్కారం ♦ సేవా కార్యక్రమాలు విస్తరిస్తాం: కొత్త అధ్యక్షుడు చౌదరి ♦ ఘనంగా ముగిసిన మహాసభలు డెట్రాయిట్ నుంచి సాక్షి ప్రతినిధి: భారత్‌లో పెండింగ్‌లో ఉన్న 3 కోట్ల పై చిలుకు కేసుల్లో స్త్రీలపై జరిగిన అకృత్యాలకు సంబంధించినవి కూడా చాలానే ఉన్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. వాటి సత్వర పరిష్కారానికి స్త్రీలకు ప్రత్యేక న్యాయ శాఖ అవసరమని అభిప్రాయపడ్డారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభల మూడో రోజు శనివారం డెట్రాయిట్లో స్త్రీల ఫోరంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారత్‌లో ప్రతి పది లక్షల మందికి కేవలం 15 మంది జడ్జీలుంటే అమెరికాలో 150 మంది ఉన్నారన్నారు. భారత్‌లో కోర్టుల సంఖ్యను కూడా పెంచాల్సి ఉందన్నారు. తెలుగు భాష మాధుర్యాన్ని భావి తరాలకు అందించాలంటే దాన్ని పిల్లలతో విధిగా సాధన చేయించాలని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. ఏదో పదేళ్ల వయసు దాకా నేర్పించి ఆ తర్వాత వదిలేస్తే తెలుగుకు అన్యాయం చేసినట్టేనని తానా సాహిత్య సభల్లో మాట్లాడుతూ అన్నారు. సుద్దాల అశోక్ తేజ ఆలపించిన నేలమ్మా పాటను అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యతలకు న్యాయం చేశా: మోహన్ తానా అధ్యక్షునిగా తన బాధ్యతలను రెండేళ్లుగా విజయవంతంగా నిర్వహించానని నన్నపనేని మోహన్ అన్నారు. డెట్రాయిట్‌లోని కోబో సమావేశ మందిరంలో జరిగిన ముగింపు వేడుకల్లో కొత్త అధ్యక్షుడు డాక్టర్ జంపాల చౌదరికి ఆయన బాధ్యతలను అప్పగించారు. తానా కార్యవర్గం తనకు పూర్తి సహకారం అందించిందని కొనియాడారు. తానాలో మార్పులను సూచించాలంటే తనకు ఒక్క ఇ-మెయిల్ పంపితే చాలని చౌదరి అన్నారు. పాత ఆశయాలను కొత్త ఒరవడిలో ముందుకు తీసుకెళ్తానని, సేవా కార్యక్రమాలను భారీగా విస్తరిస్తానని హామీ ఇచ్చారు. నూతన కార్యవర్గాన్ని సభకు పరిచయం చేశారు. తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా వేమన సతీశ్, కార్యదర్శిగా తాతా మధు, కోశాధికారిగా వెన్నం మురళీ ఉంటారు. మూడు రోజుల తానా మహాసభలు శనివారం ఘనంగా ముగిశాయి. జస్టిస్ రమణ, సభల సమన్వయకర్త నాదెళ్ల గంగాధర్, పురస్కార కమిటీ అధ్యక్షుడు కొర్రపాటి రఘులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానిం చారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, గరికపాటి మోహన్‌రావు, సీఎం రమేశ్, బోండా ఉమా, సత్యప్రసాద్, కూన రవికుమార్ తదితరులు ఈ సందర్భంగా ప్రసంగించారు. ఇరు రాష్ట్రాలు విడిపోయినా అందరం ఒక్కటేనని, త్వరలోనే అన్నీ సమస్యలు సర్దుకుంటాయని అన్నారు. మణిశర్మ సంగీత విభావరితో కార్యక్రమం ముగిసింది. సుమ, ఝాన్సీ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. నటులు అల్లరి నరేశ్, నారా రోహిత్, నిఖిల్, హీరోయిన్లు తాప్సీ, రిచా గంగోపాధ్యాయ, రకుల్‌ప్రీత్‌సింగ్ హాస్య సంభాషణలతో అలరించారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి వేడుకల్లో పాల్గొన్నారు. -
'భాషను నిరంతరం సాధన చేయండి'
- తానా సాహిత్య సభలో జస్టిస్ రమణ తెలుగు భాష మాధుర్యాన్ని భావితరాల వారికి అందించాలంటే దాన్ని తప్పనిసరిగా పిల్లల చేత సాధన చేయించాలని అంతే గానీ 10ఏళ్లు వరకు నేర్పించి తర్వాత వదిలేస్తే భాషకు అన్యాయం చేసినట్లేనని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణ అన్నారు. ఈ బాధ్యతలో ప్రవాసుల పాత్ర కీలకమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి రమణ తానా సాహిత్య సభల్లో పాల్గొని ప్రసంగిస్తూ అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు 10ఏళ్ల దాకా తెలుగు నేర్పించి వదిలేస్తున్నారని, అది మంచి పధ్ధతి కాదని, వారితో తెలుగులో ప్రతి రోజు మాట్లాడటం ద్వారా వారిలో ఆ భాషపై పట్టు, మమకారం పెంచడమే గాకుండా భాషను కూడా బతికించుకోవచ్చునని అన్నారు. నిర్మల రచించిన “ద గేమ్ ఆఫ్ లవ్” అనే పుస్తకాన్ని రమణ ఆవిష్కరించి తొలిప్రతిని యార్లగడ్డకు అందించారు. ఈ కార్యక్రమంలో వెలమల సిమ్మన్న తదితరులు పాల్గొన్నారు. ముగింపు రోజు వేడుకల్లో కూడా రమణ పాల్గొన్నారు. సుద్దాల అశోక్ తేజ, జొన్నవిత్తుల, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులను ఆయన కలుసుకుని అభినందించారు. సుద్దాల అశోక్ తేజ ఆలపించిన "నేలమ్మ నేలమ్మా" పాటకు తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. -
స్త్రీలకు ప్రత్యేక న్యాయశాఖ అవసరం: జస్టిస్ రమణ
- తానా మహిళా సదస్సులో జస్టిస్ రమణ భారతదేశంలో ప్రస్తుతం 3కోట్లకు పైగా కేసులు పెండింగులో ఉన్నాయని, వీటిలో స్త్రీలపై జరిగిన నేరాలకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయని సున్నితమైన అటువంటి కేసులను త్వరితగతిన తేల్చడానికి వారికి ప్రత్యేక న్యాయశాఖ అవసరమని తానా 20వ మహాసభల్లో స్త్రీల ఫోరంలో పాల్గొన్న జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. కోర్టుల సంఖ్య పెంచాలని, భారతదేశంలో ప్రతి 10లక్షల మందికి 13 మంది జడ్జిలు ఉంటే, అమెరికాలో 150 మంది ఉన్నారని దీనిపై ప్రభుత్వాలు కసరత్తు చేసి కోర్టుల సంఖ్యను పెంచితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. మరో అతిధి యార్లగడ్డ మాట్లాడుతూ స్త్రీలపై రోజురోజుకు కొత్త కొత్త సమస్యలు దాడులు చేస్తున్నాయని, వాటిని ధీటుగా ఎదుర్కొనడానికి ప్రత్యేక న్యాయశాఖ అవసరాన్ని తానూ కూడా సమర్ధిస్తున్నానని అన్నారు. అనంతరం స్త్రీల ఫోరం నిర్వాహకులు వీరిని సన్మానించారు. -
పట్టణాలకే పరిమితమైన అత్యాధునిక వైద్యం
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రాజమండ్రి, న్యూస్‌లైన్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ సదస్సు శుక్రవారం రాజమండ్రిలోని చెరుకూరి కల్యాణ మండపంలో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ స్వలింగ సంపర్కుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి గేలకు మద్దతు లభించిందని, అదే కోల్‌కతాలో ఒక వైద్యుడిపై ఒక రోగి వేసిన కేసులో రూ.7 కోట్లు చెల్లించాల్సి వస్తే ప్రజల నుంచి మద్దతు లభించలేదని చెప్పారు. జస్టిస్ రమణ మాట్లాడుతూ అత్యాధునిక వైద్యం కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితమైందన్నారు. నిష్ణాతులైన వైద్యులున్నా సౌకర్యాలులేక గ్రామాల్లో పూర్తిస్థాయి వైద్యం అందించలేకపోతున్నారన్నారు. వైద్య విధానాల్లో వస్తున్న మార్పులపై పలువురు వైద్యులు మాట్లాడారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం, జీఎస్ఎల్ మెడికల్ కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.