స్త్రీలకు ప్రత్యేక న్యాయశాఖ అవసరం: జస్టిస్ రమణ
- తానా మహిళా సదస్సులో జస్టిస్ రమణ
భారతదేశంలో ప్రస్తుతం 3కోట్లకు పైగా కేసులు పెండింగులో ఉన్నాయని, వీటిలో స్త్రీలపై జరిగిన నేరాలకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయని సున్నితమైన అటువంటి కేసులను త్వరితగతిన తేల్చడానికి వారికి ప్రత్యేక న్యాయశాఖ అవసరమని తానా 20వ మహాసభల్లో స్త్రీల ఫోరంలో పాల్గొన్న జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. కోర్టుల సంఖ్య పెంచాలని, భారతదేశంలో ప్రతి 10లక్షల మందికి 13 మంది జడ్జిలు ఉంటే, అమెరికాలో 150 మంది ఉన్నారని దీనిపై ప్రభుత్వాలు కసరత్తు చేసి కోర్టుల సంఖ్యను పెంచితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు.
మరో అతిధి యార్లగడ్డ మాట్లాడుతూ స్త్రీలపై రోజురోజుకు కొత్త కొత్త సమస్యలు దాడులు చేస్తున్నాయని, వాటిని ధీటుగా ఎదుర్కొనడానికి ప్రత్యేక న్యాయశాఖ అవసరాన్ని తానూ కూడా సమర్ధిస్తున్నానని అన్నారు. అనంతరం స్త్రీల ఫోరం నిర్వాహకులు వీరిని సన్మానించారు.