ఏపీ డీజీపీగా జె.వి.రాముడు నియామకం | JV Ramudu Appointed as DGP for Andhra pradesh state | Sakshi
Sakshi News home page

ఏపీ డీజీపీగా జె.వి.రాముడు నియామకం

Published Thu, Jul 24 2014 2:34 AM | Last Updated on Sat, Jun 2 2018 3:18 PM

ఏపీ డీజీపీగా జె.వి.రాముడు నియామకం - Sakshi

ఏపీ డీజీపీగా జె.వి.రాముడు నియామకం

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్తి స్థాయి డీజీపీగా జె.వి.రాముడును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాముడు ఇన్‌చార్జి డీజీపీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 1981 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రాముడు వాస్తవానికి ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేయాలి. అయితే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా పదవీ విరమణతో సం బంధం లేకుండా డీజీపీగా నియమించిన వ్యక్తిని రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.
 
 దీంతో రాముడు మరో 22 నెలల పాటు డీజీపీగా కొనసాగనున్నారు. డీజీపీ ఎంపిక ప్రక్రియపై ఈ నెల 21న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో సీఎస్ కృష్ణారావు పాల్గొన్నారు. సీనియారిటీ ప్రకారం డీజీపీ కేడర్‌లోని పది పేర్లను సమర్పించారు. అందులో నుంచి ముగ్గురు పేర్లను యూపీఎస్‌సీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ మంగళవారం లేఖ రాసింది. అందులో నుంచి రాముడిని ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ అయిన వెంటనే ఆయన బుధవారం రాత్రి బాధ్యతలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement