కామారెడ్డి కేంద్రంగా కల్తీ నూనె!
Published Thu, Aug 22 2013 3:56 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM
సంక్షేమ వసతి గృహాలలో ఉండి చదువుకునే విద్యార్థుల కోసం సర్కారు కోట్లాది రూపాయల ను ఖర్చు చేస్తోంది. కానీ, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఆశించిన ఫలితాలు రావ డం లేదు. వసతి గృహాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదనే విమర్శలు ఉన్నా యి. ఇప్పుడు హాస్టళ్లకు సరఫరా అయిన విజయ నూనె ప్యాకెట్లను నిర్వాహకులు దొడ్డిదారిన అమ్ముకుని, వంటకు నాసిరకం నూనెను వాడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇందూరు,న్యూస్‌లైన్:జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో తర చూ విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘట నలు చోటుచేసుకుంటున్నాయి. వసతి గృహాల్లో కల్తీ వంట నూనెలు వినియోగించడమే ఇందు కు కారణంగా తెలుస్తోంది. అక్రమార్కులైన కొందరు వార్డెన్లు ప్రభుత్వం అందిస్తున్న విజ య రిఫైన్డ్ నూనెప్యాకెట్లను పక్కదారి పట్టిస్తూ.. ఆయిల్ మిల్లుల నుంచి లూజ్‌గా అమ్మే నాణ్యతలేని నూనెను వంటకానికి వాడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ హర్షవర్ధన్ స్వయంగా ఇటీవల జరిగిన అధికారుల సమావేశంలో ఈ విషయా న్ని ప్రస్తావించడం గమనార్హం! తాను పర్యవేక్షణకు వెళ్లిన సమయంలో కామారెడ్డిలోని ఒక వసతి గృహంలో లూజ్ ఆయిల్‌ను గమనించానని తెలిపారు.
ఈ విషయం అధికారులెవరికీ తెలియకపోవడం వారి పర్యవేక్షణ లోపాన్ని బ యటపెడుతోందని ఫైర్ అయ్యారు. అయితే కల్తీ నూనె దందా మొత్తం కామారెడ్డి కేంద్రంగా నడుస్తున్నట్లు సమాచారం. జిల్లాలో మొత్తం 122 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. ఇందులో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 67, వెనుకబడిన తరగతుల సం క్షేమ శాఖ ఆధ్వర్యంలో 42, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 13 వసతి గృహాలు నడుస్తున్నాయి. దాదాపు అన్ని వసతి గృహాల్లో విజయ నూనె ప్యాకెట్లకు బదులు లూజ్ ఆయిల్‌నే వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.కామారెడ్డిలోని ఓ నూనెమిల్లు నుంచి ఈ డివిజన్‌లోనివసతి గృహాల వార్డెన్లు లూజ్ అయిల్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.ఈ విషయం బోధన్, నిజామాబాద్ డివిజన్ ప్రాం తాల్లోని వసతి గృహాల వార్డెన్‌ల వరకు పాకడంతో తమకు కూడా విడి నూనె సరఫరా చేయించాలని కామరెడ్డిలోని వార్డెన్‌లకు ఫోన్ చేసి తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.నెల వారీగా వచ్చే విజయ నూనె ప్యాకెట్లను దొడ్డిదారులో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి.
మెనూ ప్రకారం అందని భోజనం
జిల్లాలోని మొత్తం వసతి గృహాల్లో సుమారు ఏడు వేల మంది విద్యార్థులు ఉంటున్నారు. ప్రభుత్వం విద్యార్థుల కోసమని కొత్త మెనూను తయారు చేసింది.మెనూ ప్రకారం భోజనం, టిఫిన్లు, పౌష్టికాహారం అందించాలని సంక్షేమాధికారులను ఆదేశించింది. అయితే స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ఎల్లారెడ్డి మండల కేం ద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలో కుళ్లిన కూరగాయలు, ఉడకని అన్నం వడ్డించడంతో విద్యార్థులు ఆందోళన చేశారు. ఇంటిని తల పించే భోజనం అందిచాల్సిన వార్డెన్‌లు తింటే వాంతులు వచ్చే తిండిపెడుతున్నారని విద్యారుథలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెనూ ప్రకా రం ఆహారం పూర్తి స్థాయిలో అందడంలేదని ఆరోపిస్తున్నారు. కోడి గుడ్డు ఇస్తే మరుసటి రోజు అరటి పండు ఇస్తున్నారని, పాలు సక్రమంగా ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఇటీవల జిల్లా పర్యటించిన సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతియా కుమారి సైతం సంక్షేమ వసతి గృహాల్లో చాలా అవినీతి చోటుచేసుకుంటోందని,విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని నిరసన వ్యక్తం చేశారు.
పర్యవేక్షణ చేస్తున్నాం...
- విమల, జిల్లా బీసీ వెల్పేర్ అధికారి
ఇన్‌చార్జ్ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలను పర్యవేక్షిస్తున్నాం. మండలాల ప్రత్యేక అధికారులు వసతి గృహాలను తనిఖీ చేస్తున్నారు. కల్తీ నూనె వాడకూడదని, వాడిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా జారీ చేశాం. విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించాం.
Advertisement