commissioners
-
పురపాలక శాఖ కమిషనర్ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 24 మంది మున్సి పల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీలపై నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో అధి కారులకు స్థానచలనం కల్పించినట్లు ప్రభుత్వం తెలిపింది.ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్య దర్శి ఎం.దానకిశోర్ ఉత్తర్వులు జారీచేశారు. -
బాధ్యతలు స్వీకరించిన ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్లు
-
ECI: 15 నాటికి ఇద్దరు కొత్త ఎలక్షన్ కమిషనర్లు!
భారత ఎన్నికల కమిషన్‌లో మార్చి 15 నాటికి ఇద్దరు కొత్త కమిషనర్లు నియమితులయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ, అరుణ్ గోయల్ ఆకస్మిక రాజీనామా తర్వాత కేంద్ర ఎలక్షన్ కమిషన్‌లో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడానికి ఇంక కొన్ని రోజులే ఉందనగా కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రస్తుతం ఉన్న ఇద్దరు కమిషనర్లలో ఒకరైన అరుణ్ గోయెల్ శుక్రవారం రాజీనామా చేశారు. గోయెల్ రాజీనామాతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే ఈసీఐలో మిగిలారు. అరుణ్ గోయెల్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఆమోదించగా, దానిని ప్రకటించేందుకు న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. గోయెల్ పంజాబ్ కేడర్‌కు చెందిన 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2022 నవంబర్‌లో ఆయన ఎన్నికల కమిషన్‌లో చేరాడు. ఆయన పదవీకాలం 2027 డిసెంబర్ 5 వరకు ఉంది. ప్రస్తుత రాజీవ్ కుమార్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయనున్నారు. ఈయన తర్వాత అరుణ్ గోయెల్ ప్రధాన ఎన్నికల కమిషనర్ అయ్యేవారు. -
కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు... దేవుళ్లం అనుకుంటున్నారు
అహ్మదాబాద్: కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు తమను తాము దేవుళ్లుగా భావించుకుంటున్నారంటూ అలహాబాద్ హైకోర్టు మండిపడింది. వాళ్లు సాధారణ ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నారంటూ ఆవేదన వెలిబుచ్చింది. అహ్మదాబాద్‌లో రాత్రిపూట వెళ్తున్న ఓ జంట నుంచి ట్రాఫిక్ పోలీసులు బెదిరించి డబ్బుల వసూలు చేశారంటూ వచి్చన వార్తలను కోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, న్యాయమూర్తి జసిస్ అనిరుద్ధ పి.మాయీ ధర్మాసనం దీనిపై శుక్రవారం జరిపింది. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీసులపై ఫిర్యాదు చేసేందుకు ఉద్దేశించిన హెల్ప్‌లైన్‌ను కలెక్టర్ కార్యాలయంలో మాత్రమే ఉంచడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘పోలీసులపై ఫిర్యాదు చేయాలంటే సామాన్యులు మీ కార్యాలయాల ముందు వరుస కట్టాలా? వారిని లోపలికి అనుమతించేదెవరు? మామూలు జనానికి పోలీస్ స్టేషన్లో కాలు పెట్టడమే కష్టం. ఇక పోలీస్ కమిషనర్, కలెక్టర్ కార్యాలయాల్లోకి వెళ్లడమైతే దాదాపుగా అసాధ్యం! మీ కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు దేవుళ్లలా, రాజుల మాదిరిగా ప్రవర్తిస్తారు. ఇవన్నీ క్షేత్రస్థాయి వాస్తవాలు. ఇంతకుమించి మాట్లాడేలా మమ్మల్ని రెచ్చగొట్టొద్దు’’అని జస్టిస్ అగర్వాల్ అన్నారు. పోలీసులపై ఫిర్యాదులకు గ్రీవెన్స్ సెల్‌తో పాటు హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేయాలని, అందరికీ తెలిసేలా దాన్ని ప్రచారం చేయాలని గత విచారణ సందర్భంగా జారీ చేసిన ఆదేశాలు అమలు కాకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వెలిబుచ్చింది. -
సమాచార కమిషనర్ల ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా (ఆర్టీఐ) సీనియర్ జర్నలిస్టులు కట్టా శేఖర్‌రెడ్డి, మైదా నారాయణరెడ్డి, గిరిజన విద్యార్థి నేత గుగులోతు శంకర్‌నాయక్, న్యాయవాదులు సయ్యద్ ఖలీలుల్లా, మహ్మద్ అమీర్ హుస్సేన్ ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో వారితో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ ఎస్.రాజా సదారాం ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఐదుగురు కమిషనర్లు బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి వీరు మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ బుద్ధా మురళి, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సీఐసీలోకి నలుగురు కొత్త కమిషనర్లు
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్‌లో నలుగురు కొత్త కమిషనర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్‌లో మొత్తం ఉండాల్సిన కమిషనర్ల సంఖ్య 11 కాగా, ప్రస్తుతం అందులో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్(సీఐసీ) సహా ముగ్గురు కమిషనర్లు మాత్రమే ఉన్నారు. తాజాగా మాజీ ఐఎఫ్ఎస్(ఇండియన్ ఫారిన్ సర్వీస్) అధికారి యశ్వర్ధన్ కుమార్ సిన్హా, మాజీ ఐఆర్ఎస్ అధికారి వనజ ఎన్ సర్నా, మాజీ ఐఏఎస్ అధికారి నీరజ్ కుమార్ గుప్తా, న్యాయ శాఖ మాజీ కార్యదర్శి సురేశ్ చంద్ర సమాచార కమిషనర్లుగా నియమితులయ్యారు. వీరి నియామకంతో కమిషన్‌లో సభ్యుల సంఖ్య ఏడుకు చేరింది. సిన్హా 1981 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి. యూకేలో భారత హైకమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. తాజా నియామకంతో వనజ(1980 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారిణి) సీఐసీలోని ఏకైక మహిళా కమిషనర్‌గా నిలవనున్నారు. గుప్తా 1982 ఐఏఎస్ అధికారి కాగా, సురేశ్ చంద్ర ఈ ఏడాదే న్యాయశాఖ కార్యదర్శిగా రిటైర్ అయ్యారు. 2002–04 మధ్య ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి ప్రైవేట్ సెక్రటరీగా కూడా చంద్ర ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాలు చేసినవారు(బ్యూరొక్రాట్స్) కాకుండా.. లా, సైన్స్, సోషల్ సర్వీస్, మేనేజ్మెంట్, జర్నలిజం తదితర రంగాల్లోని నిపుణులకు(నాన్ బ్యూరొక్రాట్స్) కమిషనర్లుగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 12(5)ని ఉటంకిస్తూ మాజీ కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు విజ్ఞప్తిని తాజా నియామకాల్లో కేంద్రం పట్టించుకోలేదు. -
మాట వినకుంటే వేటే
► మూడేళ్లలో ఐదుగురు కమిషనర్ల బదిలీ ► మాట వినడం లేదనే నెపంతోనే ► అభివృద్ధిలో గుంటూరు వెనుకంజ సాక్షి, గుంటూరు : మాట వినకుంటే బదిలీ వేటు.. రాజధాని నగరంలో టీడీపీ నేతల అరాచకాలు.. అనధికార కట్టడాల జోలికి వచ్చినా.. అభివృద్ధి పనుల్లో నాసిరకం పనులు చేసినా పట్టించుకోకూడదు.. అలా కాదని అడ్డుపడితే గ్రూప్–1 అధికారి అయినా, ఐఏఎస్ అధికారి అయినా.. ఐదు నెలలు, మహా అయితే ఏడాది మాత్రమే కమిషనర్‌గా కొనసాగుతారు.. ఇది గుంటూరు నగరపాలక సంస్థ పరిస్థితి. టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో ఐదుగురు కమిషనర్లు బదిలీ కావడం గమనార్హం. రాష్ట్రంలోని ఏ కార్పొరేషన్లో జరగని విధంగా రాజధాని నగరమైన గుంటూరులో అధికార పార్టీ నేతల జోక్యం తీవ్రస్థాయిలో ఉండటంతో కింది స్థాయి అధికారుల నుంచి కమిషనర్ వరకు ఎవరినైనా ఇట్టే బదిలీ చేసేస్తున్నారు. ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళికా విభాగంతో పాటు అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసిన అధికారులు మూడేళ్లలో నలుగురైదుగురు బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చిన అధికారులు నగరంపై పట్టు సాధించేలోపే బదిలీ చేస్తున్నారు. సొంత పార్టీ నుంచే విమర్శలు... రాజధాని నగరంగా ఉన్న గుంటూరు ఆ స్థాయిలో అభివృద్ధి చెందడం లేదనేది అందరూ అంగీకరించాల్సిన బాధాకరమైన విషయం. విజయవాడకు దీటుగా గుంటూరును అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వం ఊదరగొడుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం జరగడం లేదు. తాజాగా బుధవారం జరిగిన ఐఏఎస్ బదిలీల్లో జీఎంసీ కమిషనర్ నాగలక్ష్మిని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే నగరంపై పట్టు సాధిస్తున్న నాగలక్ష్మిని బదిలీ చేయడంతో టీడీపీ ప్రజాప్రతినిధులపై సొంత పార్టీ నాయకులే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నగరంలో ఎక్కడి సమస్యలు అక్కడే... గుంటూరు నగరంలో మౌలిక సదుపాయాలైన మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం మెరుగుపరచడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయి ఉన్నాయి. వేసవి కాలం వచ్చిందంటే నగర ప్రజలు తాగునీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. ప్రపంచ బ్యాంకు నిధులతో నాలుగేళ్ళ కిందట ప్రారంభించిన సమగ్ర మంచినీటి పథకం పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. దీనికి తోడు గత రెండేళ్ళుగా ఇంజినీరింగ్ అధికారులు లీకులు ఇచ్చే పైపులైను మరమ్మతులు సైతం చేపట్టకపోవడంతో 10 నుంచి 15 ఎంఎల్డీ నీరు వృథాగా పోతోంది. నగరం అనధికార నిర్మాణాలకు అడ్డాగా మారింది. పట్టణ ప్రణాళికా విభాగంలో కొందరు అధికారులు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతూ టీడీఆర్ బాండ్ల వ్యవహారంలోనూ, లేబర్ సెస్ వసూళ్ళలోనూ భారీ మొత్తంలో మామూళ్ళు పుచ్చుకున్న వ్యవహారం విజిలెన్స్ అధికారుల విచారణలో బయటపడిన విషయం తెలిసిందే. మూడేళ్లలో ఐదుగురు కమిషనర్లు.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఐదుగురు కమిషనర్లు బదిలీ అయ్యారు. వీరిలో పి.నాగవేణి 2014 మార్చి 14న కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టగా ఆమెను అదే ఏడాది డిసెంబరు 13న అంటే తొమ్మిది నెలలకే బదిలీ చేశారు. అనంతరం అప్పటి జేసీ శ్రీధర్‌కు ఫుల్ అడిషనల్ చార్జి ఇచ్చి కమిషనర్‌గా 2014 డిసెంబరు 13న ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన్ను సైతం 2015 జనవరి 22న బాధ్యతల నుంచి తప్పించారు. అనంతరం బాధ్యతలు చేపట్టిన కన్నబాబు ఆరు నెలలు పూర్తి కాకముందే డీఎంఏగా బదిలీపై వెళ్ళారు. 2015 జూలై 8న అప్పటి గుంటూరు ఆర్డీ అనురాధ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆమెను సైతం ఐదు నెలలు కాకముందే బదిలీ చేశారు. అనంతరం 2012 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన యువ ఐఏఎస్ అధికారిణి ఎస్.నాగలక్ష్మి 2015 డిసెంబరు 7వ తేదీన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. రాజధాని నగరం కావడంతో ఐఏఎస్‌ను కొనసాగిస్తారని అందరూ భావించారు. అయితే ఆమెను సైతం ఏడాదిన్నర కూడా పూర్తి కాకముందే బదిలీ చేయడం గమనార్హం. -
గ్రేటర్ వార్
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్, కమిషనర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వారి మధ్య నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. గురువారం సాయంత్రం మేయర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ఈ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఎల్ఈడీల ఏర్పాటుపై కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని స్టాండింగ్ కమిటీ పెండింగ్‌లో ఉంచింది. కమిటీ అనుమతివ్వకపోయినా డిసెంబర్ 4వ తేదీ నుంచి అమలులోకి తెస్తామని కమిషనర్ సమావేశంలో స్పష్టం చేసినట్టు తెలిసింది. మేయర్ మహ్మద్ మాజిద్‌హుస్సేన్, కమిషనర్ సోమేశ్‌కుమార్‌ల మధ్య చాలాకాలంగా వివాదం నెలకొంది. ఒకటీ అరా సందర్భాల్లో వీరి మధ్య విభేదాలు బట్టబయలైనప్పటికీ, అంతలోనే సర్దుబాటయ్యాయి. రోడ్లపై చెత్తవేస్తే జరిమానా విధిస్తామనే ప్రకటనతో తమకు సంబంధం లేదని మేయర్ చెప్పడంతో పాటు మరికొన్ని అంశాల్లోనూ అభిప్రాయ భేదాలు బయట పడ్డాయి. తాజాగా.. రూ. 4వేల లోపు నివాస గృహాలకు ఆస్తిపన్ను రద్దుకు మేయర్ అధ్యక్షతన గురువారం సాయంత్రం సమావేశమైన స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్ణయించింది. మరోవైపు నగరమంతా ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పా టుకు కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని స్టాండింగ్ కమిటీ పెండింగ్‌లో ఉంచడంతో ఇద్దరి మధ్య పొరపొచ్చాలు బయటపడ్డాయి. నగరాన్ని వరల్డ్‌క్లాస్ సిటీగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడంతో పాటు విద్యుత్ పొదుపునకు ఉపకరిస్తుందనే భావనతో ఎల్ఈడీల ఏర్పాటుకు కమిషనర్ సిద్ధమయ్యారు. ఈ కాంట్రాక్టున ఈఈఎస్ఎల్కు అప్పగించేందుకు స్టాండింగ్ కమిటీ ముందుంచారు. దీనికి కమిటీ అంగీకరించలేదు. దీని ద్వారా తమకు ఎలాంటి ప్రయోజనం ఉండదనే తలంపుతో కొందరు ముఖ్యనేతలు మేయర్ ద్వారా ఆటంకాలు సృష్టించినట్లు తెలుస్తోంది. స్టాండింగ్ కమిటీలో చర్చ సందర్భంగా కమిషనర్ ఈ అంశంపై గట్టిగా పట్టుబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ‘మీరు ఇప్పుడు అంగీకరించకపోయినా.. డిసెంబర్4 తర్వాత అమల్లోకి తెస్తా’మని కమిషనర్ అన్నట్లు సమాచారం. డిసెంబర్ 3తో ప్రస్తుత పాలక మండలి గడువు ముగిసిపోనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆయనఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆస్తిపన్ను వసూళ్లు పెంచేందుకు కమిషనర్ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో.. మేయర్ రూ. 4వేల లోపు ఆస్తిపన్ను రద్దు చేస్తూ ప్రకటన చేయడం విభేదాలపై ప్రచారాలకు ఊతమిస్తోంది. -
కమిషనర్ల పని కత్తి మీద సామే
సాక్షి, రాజమండ్రి :‘తాత్కాలిక ఉద్యోగులకు ఎలాంటి రుణాలు ఇచ్చినా చర్యలు ఉంటాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భవిష్య నిధి జమ చేయడంలో అలసత్వం వహిస్తే సహించేది లేదు. ఆర్థిక వ్యవహారాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు. జమా ఖర్చుల విషయంలో కచ్చితంగా ఉండాలి. అమలు చేస్తున్న పథకాల్లో అలసత్వంపై చర్యలు ఉంటాయి’.. ఇలా మున్సిపల్ కమిషనర్ల నెత్తిన ఆంక్షల కత్తి పెట్టింది పురపాలక శాఖ. ప్రజలు ఎన్నుకునే పాలకమండళ్లు ఏర్పడే లోపే ప్రత్యేకాధికారుల పాలనలోనే పురపాలికల ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దే చర్యల మిషతో ప్రభుత్వం కమిషనర్ల విసృ్తతాధికారాలకు కళ్లెం వేసేందుకు ప్రయత్నిస్తోంది. మున్సిపల్ రీజియన్ల డెరైక్టర్లకు పై అంశాలపై తనిఖీ అధికారాలు ఇవ్వడమే కాక మాట వినని వారిపై చర్యలకు ఆదేశించే హక్కును కూడా కట్టబెట్టారు. దీంతో కమిషనర్లు.. ఆర్థికపరంగా ఏ నిర్ణయం తీసుకుంటే నిప్పుతో చెలగాటమవుతుందోనని, ఏ చర్యలు చేపడితే చీవాట్లు పడతాయోనని తలలు పట్టుకుంటున్నారు. అభివృద్ధి కన్నా రాబడే ముఖ్యం..పట్టణాలు, నగరాల్లో అభివృద్ధిని పక్కన పెట్టయినా సరే ఆదాయం పెంచుకోవాలనే ధోరణితో ఉన్న పురపాలక శాఖ ప్రస్తుతం పన్ను వసూళ్లపై దృష్టి పెట్టింది. ఈ ఏడాదిఎట్టి పరిస్థితుల్లో నూరు శాతం పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఉన్నతాధికారులు లక్ష్యాలు చేరని కమిషనర్లపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అసలే ఒక పక్క స్థానిక రాజకీయ ఒత్తిళ్లు, మరో పక్క ఉన్నతాధికారుల ఆదేశాల నడుమ నలిగిపోతున్న కమిషనర్లకు కొత్తగా పెడుతున్న ఆర్థిక ఆంక్షలు సంకె ళ్లలా పరిణమిస్తున్నాయని జిల్లాకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. మింగుడు పడని చేదుమాత్రలు నాలుగు రోజుల క్రితం రీజనల్ డెరైక్టర్లతో ఆ శాఖ డెరైక్టర్ బి.జనార్దనరెడ్డి హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం 12 అంశాలపై కమిషర్లపై ఒత్తిడి తేవాలని, మాట వినని వారిపై నివేదిక పంపాలని చెప్పినట్టు తెలుస్తోంది. ఆ అధికారాలను ఆర్డీలకు అప్పచెప్పారు. ఇప్పటికే రాజమండ్రి ఆర్డీ రవీంద్రబాబు పన్నుల వసూళ్లపై కమిషనర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.అలాగే జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల ఆర్ధిక లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ‘చెత్తపై కొత్త సమరం’ పేరుతో వంద రోజుల కార్యక్రమం, బాగా చదువుకుందాం, స్ట్రీట్ వెండర్స్‌పై సర్వే, ఇల్లులేని వారికి షెల్టర్లు కల్పించేందుకు సర్వే, అనధికారిక కట్టడాల సర్వే, పెండింగ్ కోర్టు కేసుల వ్యవహారాలు.. ఇలా ఇప్పటికే కమిషనర్లు తలకు మించిన పనిభారంతో సతమతమవుతున్నారు. ఈ తరుణంలో తమపై మరింత ఒత్తిడి పెంచే నిర్ణయాలు వారికి చేదుమాత్రల్లా మింగుడుపడడం లేదు. -
అధికారులకు బదిలీ బెంగ !
పాలమూరు, న్యూస్‌లైన్: ఉన్నతాధికారులు, తహశీల్దార్లకు సార్వత్రిక ఎన్నికల బదిలీ బెంగ పట్టుకుంటుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే గెజిటెడ్ అధికారులను సొంతజిల్లాల నుంచి ఆర్నెళ్ల ముందునుంచే ఇతర జిల్లాల కు పంపించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయం అమలులో ఉంది. ఈ మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే పలువురు ఉన్నతాధికారు లు, తహశీల్దార్లను జిల్లా నుంచి బదిలీచేసే అవకాశం ఉంది. 2009 ఎన్నికల సమయంలో కేవలం 15రోజుల ముందు సొంత జిల్లాకు చెందినవారు, మూడేళ్లుగా ఒకే జిల్లాలో పనిచేస్తున్న తహశీల్దార్లకు మరో చోటకు పంపి అక్కడి వారిని మన జిల్లాలో నియమించారు. ఎన్నికల విధులు ముగియగానే ఎక్కడివారిని అక్కడికి మార్చారు. అయితే ఈసారి ఆరునెలల ముందే పంపించాలని ఎన్నికల సంఘం నిర్ణయించడంతో సాధారణ పరిపాలనశాఖ తగిన కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ విధానం కొనసాగితే ఎన్నికల ప్రక్రియకు ఆరునెలల ముందుగానే జిల్లాలోని పలువురు అధికారులు, తహశీల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ తప్పదని తెలుస్తోంది. 36 మండలాల్లో స్థానికులు జిల్లాలో 64 మండలాలకు 28 మండలాల్లో నల్గొండ జిల్లాకు చెందినవారు తహశీల్దార్లుగా పనిచేస్తున్నారు. మిగిలిన 36 మండలాల్లో స్థానికులే కొనసాగుతున్నారు. వీరందరికీ స్థానచలనం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. జిల్లాలో పనిచేస్తున్న అదే జిల్లా అధికారులు, మూడేళ్లుగా పనిచేస్తున్న వారి వివరాలను పంపించాలని ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం వివరాలను సేకరించనుంది. 2009 ఎన్నికల సమయంలో పదవీ విరమణ చేసే వారికి మినహాయింపు ఇచ్చిన ఎన్నికల సంఘం ఈసారి దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో 2014 ఏప్రిల్‌కు అటు ఇటూ పదవీ విరమణ చేసేవారిలో సందిగ్ధం నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో ఎలాగూ బదిలీతప్పదని భావించిన సొంతజిల్లా అధికారులు ఇప్పటినుంచే ఇతర జిల్లాలకు బదిలీ చేయించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరి కొందరు తహ శీల్దార్లు ఎన్నికల విధులతో సంబంధం లేని విభాగాలకు వెళ్లేందుకు ముందస్తుగానే సిద్ధపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్నది నిర్ణయించనప్పటికీ.. 2014 ఏప్రిల్‌ను దృష్టిలో ఉంచుకుని ఆరునెలలు ముందుగానే బదిలీ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందని, అలాగైతే నవంబర్, డిసెంబర్ నెలల్లో సొంత జిల్లాలోని అధికారులు బదిలీలు చేపట్టనున్నారు. 36 మండలాలకు చెందిన తహశీల్దార్లు మనజిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం. ఎన్నికల సంఘం నిబంధన ప్రకారం వీరిని ఇతర చోట్లకు బదిలీ చేసే అవకాశాలున్నాయని సమాచారం. కాగా దీన్ని ఇప్పటికిప్పుడు అమలుచేయాలని తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని డిఆర్వో రాంకిషన్ పేర్కొన్నారు. -
గోధుమలు గోవిందా..!
జమ్మికుంట, న్యూస్‌లైన్ : జమ్మికుంట ఎఫ్‌సీఐ గోదాముల్లో నిల్వచేసిన గోధుమలు పెద్ద ఎత్తున మాయమయ్యా యి. విత్తు తరుగుపోకుండా కాపాడాల్సిన మేనేజరే ఏంచక్కా స్వాహా చేశాడు! ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా 620 క్వింటాళ్లు తినేశాడు! ప్రస్తుతం ఈయన రిటైర్ అయ్యారు. ఓపెన్యార్డులోని గోధుమలు దొంగలపాలవుతున్నాయని, ఈ సందుచూసి ఇంటిదొంగలు సైతం మింగుతున్నారని ‘సాక్షి’ గతంలోనే హెచ్చరిం చింది. ఉన్నతాధికారులు తేరుకోకపోవడంలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పెద్ద ఎత్తున గోధుమలు మాయమైనట్లు ఆలస్యంగా గుర్తించి పోలీసులు ఫిర్యాదు చేశారు. విచిత్రమేంటంటే గోధుమలు పోయాయని చెప్పిన చోట ఆ బస్తాల ఆనవాళ్లు మచ్చుకైనా కానరాకపోగా.. బండరాళ్లు అధికారుల నిర్లక్ష్యాన్ని వెక్కిరిస్తున్నాయి. 2011-12లో పంజాబ్ రాష్ట్రానికి చెందిన 5,23,836 బస్తాల గోధుమలు జమ్మికుంటలో దిగుమతి కాగా, ఎఫ్‌సీఐలో ఓపెన్‌యార్డులో నిల్వ చేశారు. ఒక్కో బస్తా 50 కిలోలు ఉంటుంది. వీటిలోంచి కొన్ని బస్తాలు మళ్లీ పంజాబ్ పంపించగా... ఇప్పటికీ ఇక్కడ 2,600 క్వింటాళ్లు నిల్వ ఉన్నాయి. భద్రత లేకుండా నిల్వలు చేయడంతో ఓపెన్యార్డు నుంచి గుర్తుతెలియని వ్యక్తులు గోధుమ బస్తాలను ప్రహరీపైనుంచి ఎత్తుకెళ్లారు. ఓరోజు రాత్రి ఇద్దరు వ్యక్తులు రెండు క్వింటాళ్ల గోధుమలు దొంగిలిస్తుండగా ధర్మారం గ్రామస్తులు వెంబడించారు. దీంతో సదరు వ్యక్తుల సైకిళ్లు విడిచిపెట్టి పరారయ్యారు. గ్రామస్తులు గోధుమ బస్తాలను గ్రామపంచాయతీలో భద్రపరిచారు. ఈ వైనంపై ‘గోదాములు దాటుతున్న గోధుమలు’ శీర్షికన ‘సాక్షి’ రెండేళ్ల క్రితమే కథనం ప్రచురించింది. ఈ క్రమంలో పంజాబ్‌కు చెందిన ఎఫ్‌సీఐ, సివిల్ సప్లయ్ అధికారులు జమ్మికుంటలో నిల్వ ఉన్న గోధుమలు పరిశీలించారు. మూడు రోజులపాటు ఓపెన్‌యార్డుల్లో ఉన్న బస్తాలన్నింటినీ లారీల్లో వేబ్రిడ్జి తూకాలు వేశారు. నిల్వల్లో భారీగా తేడాలున్నట్లు నాడు వెల్లడించారు. నివేదిక ఉన్నాధికారులకు సమర్పిస్తున్నట్లు అప్పుడు చెప్పారు. తాజాగా మే నెలలో తొమ్మిది వేల టన్నుల గోధుమలు రాగా, ఓపెన్‌యార్డుల్లో 76 చోట్ల స్టాక్ పాయింట్లలో నిల్వ ఉంచారు. జూన్‌లో ఎఫ్‌సీఐ డిపో మేనేజర్‌గా చిన్న నారాయణ బాధ్యతలు స్వీకరించే సమయంలో గోదాముల్లోని నిల్వలన్నింటినీ పరిశీలించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రీజినల్ విజిలెన్స్ స్క్వాడ్(ఆర్వీఎస్) అధికారులు ఈ నెల 12, 13 తేదీల్లో గోధుమలు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రికార్డుల అధారంగా 5/9,5/10 ప్లీంత్ల్లో 1240 గోధుమ బస్తాలు మాయం అయినట్లు నిర్ధరించారు. నిల్వలకు, రికార్డులకు మధ్య ఈమేరకు తేడా ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ రూ.9 లక్షలు ఉంటుందని వెల్లడించారు. విషయాన్ని ఎఫ్‌సీఐ ఏరియా మేనేజర్‌కు తెలుపగా, ఆయన స్థానిక పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. జూన్‌లో డిపో మేనేజర్‌గా పనిచేసి రిటైర్డ్ అయిన సంజీవరావు ఈ గోధుమలు మాయం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎగుమతి, దిగుమతి రిజిస్టర్లు సొంతంగా నిర్వహించి, అక్రమాలకు పాల్పడినట్లు అందులో పేర్కొన్నారు. దీంతో సంజీవరావుపై కేసు నమోదు చేసినట్లు సీఐ భూమయ్య వెల్లడించారు. దీంతో అసలు ఎఫ్‌సీఐలో ఏం జరుగుతుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాడు ‘సాక్షి’లో కథనం ప్రచురించి అప్రమత్తం చేసినా పట్టించుకోకపోవడంతోనే ఈ అక్రమాల దందా ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. -
కిరణ్ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
-
కమీషనర్ల నియామకాన్ని రద్దు చేసిన హైకోర్టు
-
కామారెడ్డి కేంద్రంగా కల్తీ నూనె!
సంక్షేమ వసతి గృహాలలో ఉండి చదువుకునే విద్యార్థుల కోసం సర్కారు కోట్లాది రూపాయల ను ఖర్చు చేస్తోంది. కానీ, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఆశించిన ఫలితాలు రావ డం లేదు. వసతి గృహాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదనే విమర్శలు ఉన్నా యి. ఇప్పుడు హాస్టళ్లకు సరఫరా అయిన విజయ నూనె ప్యాకెట్లను నిర్వాహకులు దొడ్డిదారిన అమ్ముకుని, వంటకు నాసిరకం నూనెను వాడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందూరు,న్యూస్‌లైన్:జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో తర చూ విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘట నలు చోటుచేసుకుంటున్నాయి. వసతి గృహాల్లో కల్తీ వంట నూనెలు వినియోగించడమే ఇందు కు కారణంగా తెలుస్తోంది. అక్రమార్కులైన కొందరు వార్డెన్లు ప్రభుత్వం అందిస్తున్న విజ య రిఫైన్డ్ నూనెప్యాకెట్లను పక్కదారి పట్టిస్తూ.. ఆయిల్ మిల్లుల నుంచి లూజ్‌గా అమ్మే నాణ్యతలేని నూనెను వంటకానికి వాడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హర్షవర్ధన్ స్వయంగా ఇటీవల జరిగిన అధికారుల సమావేశంలో ఈ విషయా న్ని ప్రస్తావించడం గమనార్హం! తాను పర్యవేక్షణకు వెళ్లిన సమయంలో కామారెడ్డిలోని ఒక వసతి గృహంలో లూజ్ ఆయిల్‌ను గమనించానని తెలిపారు. ఈ విషయం అధికారులెవరికీ తెలియకపోవడం వారి పర్యవేక్షణ లోపాన్ని బ యటపెడుతోందని ఫైర్ అయ్యారు. అయితే కల్తీ నూనె దందా మొత్తం కామారెడ్డి కేంద్రంగా నడుస్తున్నట్లు సమాచారం. జిల్లాలో మొత్తం 122 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. ఇందులో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 67, వెనుకబడిన తరగతుల సం క్షేమ శాఖ ఆధ్వర్యంలో 42, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 13 వసతి గృహాలు నడుస్తున్నాయి. దాదాపు అన్ని వసతి గృహాల్లో విజయ నూనె ప్యాకెట్లకు బదులు లూజ్ ఆయిల్‌నే వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.కామారెడ్డిలోని ఓ నూనెమిల్లు నుంచి ఈ డివిజన్లోనివసతి గృహాల వార్డెన్లు లూజ్ అయిల్ను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.ఈ విషయం బోధన్, నిజామాబాద్ డివిజన్ ప్రాం తాల్లోని వసతి గృహాల వార్డెన్ల వరకు పాకడంతో తమకు కూడా విడి నూనె సరఫరా చేయించాలని కామరెడ్డిలోని వార్డెన్లకు ఫోన్ చేసి తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.నెల వారీగా వచ్చే విజయ నూనె ప్యాకెట్లను దొడ్డిదారులో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. మెనూ ప్రకారం అందని భోజనం జిల్లాలోని మొత్తం వసతి గృహాల్లో సుమారు ఏడు వేల మంది విద్యార్థులు ఉంటున్నారు. ప్రభుత్వం విద్యార్థుల కోసమని కొత్త మెనూను తయారు చేసింది.మెనూ ప్రకారం భోజనం, టిఫిన్లు, పౌష్టికాహారం అందించాలని సంక్షేమాధికారులను ఆదేశించింది. అయితే స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ఎల్లారెడ్డి మండల కేం ద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలో కుళ్లిన కూరగాయలు, ఉడకని అన్నం వడ్డించడంతో విద్యార్థులు ఆందోళన చేశారు. ఇంటిని తల పించే భోజనం అందిచాల్సిన వార్డెన్లు తింటే వాంతులు వచ్చే తిండిపెడుతున్నారని విద్యారుథలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెనూ ప్రకా రం ఆహారం పూర్తి స్థాయిలో అందడంలేదని ఆరోపిస్తున్నారు. కోడి గుడ్డు ఇస్తే మరుసటి రోజు అరటి పండు ఇస్తున్నారని, పాలు సక్రమంగా ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఇటీవల జిల్లా పర్యటించిన సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతియా కుమారి సైతం సంక్షేమ వసతి గృహాల్లో చాలా అవినీతి చోటుచేసుకుంటోందని,విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని నిరసన వ్యక్తం చేశారు. పర్యవేక్షణ చేస్తున్నాం... - విమల, జిల్లా బీసీ వెల్పేర్ అధికారి ఇన్చార్జ్ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలను పర్యవేక్షిస్తున్నాం. మండలాల ప్రత్యేక అధికారులు వసతి గృహాలను తనిఖీ చేస్తున్నారు. కల్తీ నూనె వాడకూడదని, వాడిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా జారీ చేశాం. విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించాం.