భారత ఎన్నికల కమిషన్‌లో మార్చి 15 నాటికి ఇద్దరు కొత్త కమిషనర్లు నియమితులయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ, అరుణ్ గోయల్ ఆకస్మిక రాజీనామా తర్వాత కేంద్ర ఎలక్షన్ కమిషన్‌లో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి.
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడానికి ఇంక కొన్ని రోజులే ఉందనగా కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రస్తుతం ఉన్న ఇద్దరు కమిషనర్‌లలో ఒకరైన అరుణ్ గోయెల్ శుక్రవారం రాజీనామా చేశారు. గోయెల్ రాజీనామాతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే ఈసీఐలో మిగిలారు.
అరుణ్ గోయెల్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఆమోదించగా, దానిని ప్రకటించేందుకు న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. గోయెల్ పంజాబ్ కేడర్‌కు చెందిన 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2022 నవంబర్‌లో ఆయన ఎన్నికల కమిషన్‌లో చేరాడు. ఆయన పదవీకాలం 2027 డిసెంబర్ 5 వరకు ఉంది. ప్రస్తుత రాజీవ్ కుమార్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయనున్నారు. ఈయన తర్వాత అరుణ్ గోయెల్ ప్రధాన ఎన్నికల కమిషనర్ అయ్యేవారు.
Comments
Please login to add a commentAdd a comment