రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు | Kapu leaders stage protests in support of Mudragada | Sakshi
Sakshi News home page

రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు

Published Sat, Feb 6 2016 12:16 PM | Last Updated on Mon, Jul 30 2018 6:21 PM

రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు - Sakshi

రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు

తూర్పుగోదావరి: కాపులను బీసీలలో చేర్చాలని డిమాండ్ చేస్తూ.. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

పి.గన్నవరం: పి. గన్నవరంలో శనివారం ఉదయం ఐదుగురు యువకులు ఆమరణదీక్షకు దిగారు. ముద్రగడ దీక్ష రెండోరోజుకు చేరుకోవడంతో..  ఆయనకు మద్దతుగా పలు ప్రాంతాల్లో సంఘీభావంగా దీక్షలు చేస్తున్నారు.

పాలకొల్లు : పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు నాయకులు శనివారం వినూత్నంగా నిరసన తెలిపారు. పాలకొల్లు గాంధీబొమ్మవద్ద బీసీ రిజర్వేషన్ అనే భోజనం కావాలని డిమాండ్ చేస్తూ ప్లాస్టిక్ విస్తరాకులతో నిరసన నిర్వహించారు. ఈ నిరన కార్యక్రమానికి పెద్దసంఖ్యలో కాపు నేతలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement