
కేతిరెడ్డి పెద్దా రెడ్డి
తాడిపత్రి: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై తాడిపత్రి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ..చిన్నపొలమడ ప్రభోదానంద ఆశ్రమం వద్ద జరిగిన అల్లర్లకు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డే కారణమని ఆరోపించారు. తాడిపత్రి పోలీసులు ఆశ్రమం వారిపైనే కేసులు నమోదు చేస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తాడిపత్రి పోలీసులకు అధికారుల మాటల కంటే జేసీ సోదరుల మాటలే వేదవాక్కుల్లాగా భావిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీస్ స్టేషన్‌కు తాళం వేసి, ధర్నా చేసినా కూడా జేసీపై చర్యలు తీసుకోవాలంటే పోలీసులు భయపడటమే దీనికి నిదర్శనమన్నారు.
డీఎస్పీ విజయ్‌కుమార్‌పై జేసీ అసభ్య పదజాలంతో అనుచితంగా మాట్లాడినా కూడా చర్యలు తీసుకోలేదంటే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనుమానం కలుగుతోందన్నారు. వచ్చే నెల 15 లోపు జేసీ దివాకర్ రెడ్డిపై సుమోటో కింద కేసు నమోదు చేయకుంటే ఎస్పీ ఆఫీసు వద్ద కానీ, తాడిపత్రి డీఎస్పీ ఆఫీసు వద్ద కానీ పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని పెద్దారెడ్డి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment