
ర్యాలీగా వస్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి
అనంతపురం ,ముదిగుబ్బ : గ్రామాల్లో జన్మభూమి కమిటీ సభ్యులు,కోర్ కమిటీ సభ్యులు ఎవరైనా బెదిరింపులకు దిగితే ఎదిరించాలని వైఎస్సార్‌సీపీ తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి భరోసా ఇచ్చారు. ఎవరూ అధైర్యపడొద్దు..అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శుక్రవారం సంకేపల్లిలో రచ్చబండ సందర్భంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ముందుగా తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి సోదరుడు వెంకట కృష్ణారెడ్డి, కేతిరెడ్డి సాయి ప్రతాప్‌రెడ్డికి స్వాగతం పలికారు.