
మాట్లాడుతున్న పైలా నరసింహయ్య(ఫైల్)
సాక్షి, అనంతపురం : తాడిపత్రి డీఎస్పీ విజయ్‌కుమార్‌ను అసభ్యపదజాలంతో దూషిస్తూ పోలీసుల ఆత్మగౌరవాన్ని భంగం కలిగించేలా వ్యవహరించింనందుకు జేసీ దివాకర్ రెడ్డి పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నరసింహయ్య డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాడిపత్రి ప్రభోదానంద స్వామి ఆశ్రమం వద్ద జరిగిన సంఘటనపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్. కేవలం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పోలీసులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభోదానంద ఆశ్రమం వద్ద జరిగిన అల్లర్లకు ముఖ్యకారణమైన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై ఇప్పటి వరకు కేసు నమోదు చెయ్యకపోవటం శోచనీయమన్నారు.