![YSRCP Activists houses ravaged in Ananthapur - Sakshi - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/19/house_0.jpg.webp?itok=AVg6udqj)
సాక్షి, అనంతపురం : జిల్లాలోని పెద్దవడుగూరు మండలం అప్పేచెర్లలో ఆదివారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆస్తులపై తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఆక్రమణల తొలగింపు పేరుతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెందిన ఐదు ఇళ్లను కూల్చి వేశారు. అనంతరం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వ్యవసాయ క్షేత్రాల్లో విధ్వంసం సృష్టించారు.
ఇటీవల అనంతపురంలో దారుణహత్యకు గురైన వైఎస్‌ఆర్ సీపీ నేత విజయ్ భాస్కర్ రెడ్డి కేసులో రాజీకి రావడంలేదనే తెలుగుదేశం కార్యకర్తలు వ్యక్తిగత దాడులకు, బెదిరింపులకు పాల్పడుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. హత్య విషయంలో రాజీ పడాలంటూ తమకు పలుమార్లు బెదిరింపులు వచ్చినట్లు తెలిపారు. హంతకులకు వ్యతిరేకంగా సాక్షం చెప్తామనే ఉద్దేశంతోనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని అన్నారు. ఓ వైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ ఇళ్లపై దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment