ఖరీఫ్ ఉత్పత్తి లక్ష్యం 12 లక్షల మెట్రిక్ టన్నులు
కొయ్యలగూడెం, న్యూస్‌లైన్ : రానున్న ఖరీఫ్ సీజన్‌లో 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి లక్ష్యం గా పెట్టుకున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు వి.సత్యనారాయణ తెలిపారు. పరింపూడిలోని కొయ్యలగూడెం మండల వ్యవసాయూధికారి కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ లక్ష్యం గతేడా ది కంటే నాలుగున్నర మెట్రిక్ టన్నులు అదనంగా చెప్పుకొచ్చారు. దీని కోసం లక్షా ఇరవై వేల క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. అదే విధంగా 8,500 మట్టి నమూనాల సేకరణలు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 25 శాతం పూర్తి చేసినట్లు చెప్పారు.
జిల్లాలో రూ.6 కోట్ల 20 లక్షలతో 106 రైతుమిత్ర గ్రూప్‌లకు సబ్సిడీపై వ్యవసాయ యం త్ర పరికరాలు అందజేయనున్నామని, ఇప్పటికే రూ.5.38 కోట్ల విలువైన సామాగ్రిని అందించామన్నారు. 33 బ్యాంక్‌ల ద్వారా నీలం తుఫాన్ నష్టపరిహారం రూ.2 కోట్ల 73 లక్షలకు గానూ రూ.35 లక్షలు రైతులకు అందించాల్సి ఉందని, మిగిలిన సొమ్మును రైతుల అకౌంట్లలో జమ చేసినట్లు తెలిపారు. ఖరీఫ్ సీజన్‌కు కావాల్సిన ఎరువులను సిద్ధం చేశామని, వ్యవసాయ సొసైటీలు, ప్రైవేట్ డీలర్లకు రెండు రోజుల్లో పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో 2,200 మంది ఆదర్శ రైతులకు గానూ ప్రస్తుతం 1,550 మంది ఉన్నారని విలేకరుల అడిగిన ఓ ప్రశ్నకు జేడీ సమాధానమిచ్చారు.