సాక్షి, గుంటూరు: రాష్ట్ర విభజనపై స్పష్టమైన ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయిన సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి.. నిర్ణయం జరిగాక రెండునెలలకు మాట్లాడటం కాంగ్రెస్ డ్రామాయేనని వైఎస్సార్‌పీసీ నేత అంబటి రాంబాబు అన్నారు. కాంగ్రెస్ నాటకంలో కిరణ్ పావుగా ఉపయోగపడుతున్నారని ధ్వజమెత్తారు. రోడ్‌మ్యాప్‌లు అడిగినపుడు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నపుడు సీఎం ఏం చేశారు? అప్పుడే కిరణ్, బొత్సలు ఎందుకు స్పందించలేదు? అని నిలదీశారు. అసమర్థ సీఎం వల్లే ఈ సమస్యలు వచ్చాయని అన్నారు.