అర్హత లేకున్నా కిరణ్ను సీఎంను చేశారు | Kiran kumar reddy has no eligibility to become CM, says Ponnam Prabhakar | Sakshi
Sakshi News home page

అర్హత లేకున్నా కిరణ్ను సీఎంను చేశారు

Published Fri, Nov 1 2013 2:59 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

అర్హత లేకున్నా కిరణ్ను సీఎంను చేశారు - Sakshi

అర్హత లేకున్నా కిరణ్ను సీఎంను చేశారు

న్యూఢిల్లీ : అర్హత లేకున్నా కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ముఖ్యమంత్రిని చేశారని కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ దేశంలో అధిక రాష్ట్రాలు ఏర్పాటు చేసింది ఇందిరాగాంధీయేనన్నారు. విభజన నిర్ణయంపై కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును పొన్నం ప్రభాకర్ తప్పుబట్టారు.

టీడీపీ నేత  పయ్యావుల కేశవ్తో సుప్రీంకోర్టులో కేసు వేయించి చంద్రబాబు నాయుడు తెలంగాణకు అడ్డుపడుతున్నారని పొన్నం మండిపడ్డారు. కాగా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పయ్యావుల కేశవ్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈనెల 18వ తేదీకి వాయిదా పడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement