కరీంనగర్‌లో 15న సోనియా బహిరంగ సభ
హైదరాబాద్: ఎట్టకేలకూ సుదీర్ఘ కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అడుగుపెట్టనున్నారు. తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్ జిల్లాలో ఏప్రిల్ 15 తేదిన నిర్వహించే బహిరంగ సభలో సోనియాగాంధీ పాల్గొంటారు. 2004లో జరిగిన కరీంనగర్ ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలు తనకు తెలుసునని సోనియా హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో సోనియాగాంధీ నిర్ణయం కీలకమారిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధించే దిశగా పార్టీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే కరీంనగర్ పట్టణంలో సోనియా సభను ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ తరపున పోటి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే విలీనం చేస్తామని టీఆర్ఎస్ పార్టీ తప్పిన మాట తప్పడాన్ని ప్రజల దృష్టికి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.