కరీంనగర్‌లో నేడు సోనియా బహిరంగ సభ
కరీంనగర్‌లో నేడు సోనియా బహిరంగ సభ
Published Wed, Apr 16 2014 1:51 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
సాక్షి, హైదరాబాద్/కరీంనగర్: కాంగ్రెస్ అధినేత్రి సోని యాగాంధీ బుధవారం రాష్ట్రానికి వస్తున్నారు. కరీంనగర్‌లో జరిగే సభలో ఆమె పాల్గొంటారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. సోనియా బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో హకీంపేటకు చేరుకుం టారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ వెళ్లి అక్కడ ఎన్నికల సభలో పాల్గొంటారు.
సాయంత్రం 5 గంటలకు బేగంపేట చేరుకుని ఢిల్లీ పయనమవుతారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సోనియా వెంట ఉంటారు. కాగా, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శి కుంతియా కరీంనగర్ సభాస్థలివద్ద ఏర్పాట్లను సమీక్షించారు. ఈసారి స్టేడియంలో 2 వేదికలు నిర్మించారు. సోనియా ప్రసంగించడానికి ఒకటి, తెలంగాణలోని 119 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల అభ్యర్థుల కోసం మరోటి ఏర్పాటు చేశారు.
Advertisement
Advertisement