'అసమర్ధ సీఎం ఉండటం వల్లే ఈ దుస్థితి'
కర్నూలు: ట్రిబ్యునల్ తీర్పుతో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలు ఏడారిగా మారతాయని వైఎస్సార్ సీపీ నేత శోభా నాగిరెడ్డి తెలిపారు. అసమర్ధ సీఎం, నిలదీయలేని ప్రతిపక్షనేత ఉండటం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడిందనిఆమె మండిపడ్డారు. ట్రిబ్యునల్ తీర్పుతో ..తెలంగాణ, రాయలసీమ ఏడారిగా మారే అవకాశం ఉందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేలుకో్వాలని ఆమె సూచించారు. ట్రిబ్యునల్పై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ విద్యుత్, సాగునీటి కష్టాలు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి. కృష్ణానది నీటి కేటాయింపులపై ఏర్పాటైన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు వ్యతిరేకంగానే ఉండే అవకాశముందనే వార్తలు ఊపందుకున్నాయి. ఒకవేళ ట్రిబ్యునల్ తీర్పు ఆంద్రప్రదేశ్ కు వ్యతిరేకంగా ఉంటే తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలు ఎడారిగా మారే అవకాశం ఉందని నేతలు అభిప్రాయపడుతున్నారు.