
సమైక్యాంధ్ర పేరుతో కిరణ్ కొత్త పార్టీ: పెద్దిరెడ్డి
సమైక్యాంధ్ర పేరుతో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టే వ్యూహంలో ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
చిత్తూరు: సమైక్యాంధ్ర పేరుతో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టే వ్యూహంలో ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కొత్త పార్టీ తరపున సీఎం కిరణ్ పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని ఆయన ఎద్దేవా చేశారు. కిరణ్కు డిపాజిట్లు వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన ప్రకటించారు. రాజకీయ ప్రయోజనం కోసమే కిరణ్ సమైక్య రాగం అందుకున్నారని ఆరోపించారు.
రాష్ట్ర విభజనకు అనుకూలంగా సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడు కిరణ్, బొత్స సత్యనారాయణ ఏంచేశారని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉద్యమం చేస్తోందని చెప్పారు. దీంతో సీఎం కిరణ్, చంద్రబాబు ముచ్చెటమలు పడుతున్నాయని అన్నారు. వచ్చే నెల 2న సమైక్యాంధ్రకు మద్దతుగా తమ పార్టీ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టనున్నట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.