చంద్రబాబుతో ఎంపీ గీత భేటీ | kottapalli geeta meets chandra babu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుతో ఎంపీ గీత భేటీ

Published Tue, Jul 29 2014 1:26 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

చంద్రబాబుతో ఎంపీ గీత భేటీ - Sakshi

చంద్రబాబుతో ఎంపీ గీత భేటీ

సాక్షి, హైదరాబాద్:  విశాఖ జిల్లా అరకు నియోజవకర్గ లోక్‌సభ సభ్యురాలు కొత్తపల్లి గీత సోమవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. టీడీపీపీ నేత వై.సత్యనారాయణచౌదరి (సుజనాచౌదరి) వెంట ఆమె చంద్రబాబును కలిసేందుకు వెళ్లారు. చంద్రబాబుతో భేటీ అనంతరం ఎంపీ గీత ‘సాక్షి’తో మాట్లాడుతూ తన నియోజకవర్గం నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉందని, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అధికారులతో సమీక్షించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, స్థానికంగా పరిష్కరించాల్సిన అంశాలకు సంబంధించి తొమ్మిది పేజీల వినతిపత్రాన్ని తయారు చేసి ముఖ్యమంత్రికి అందచేశానని చెప్పారు.

 

ఇదిలావుంటే కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డి సోమవారం లేక్‌వ్యూ అతిథిగృహంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. నంద్యాల ఎంపీ ఎస్.పి.వై.రెడ్డి, మాజీ మంత్రి టి.జి.వెంకటేష్ కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా కేశవరెడ్డిని చంద్రబాబు పార్టీలో చేర్చుకున్నారు.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement