kottapalli geeta
-
కొత్తపల్లి గీత భర్తకు చుక్కెదురు
-
కొత్తపల్లి గీత భర్తకు చుక్కెదురు
హైదరాబాద్: బ్యాంకు రుణం ఎగవేత కేసులో అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త పరుచూరి రామకోటేశ్వరరావుకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. తనకు వ్యతిరేకంగా ఎర్రమంజిల్ ఇచ్చిన తీర్పును నాంపల్లి కోర్టులో సవాల్ చేసిన ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. రామకోటేశ్వరరావుకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఎర్రమంజిల్ కోర్టు ఇచ్చిన తీర్పును నాంపల్లి కోర్టు సమర్థించింది. సొంత కంపెనీ కోసం పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ. 25 కోట్లు రుణంగా తీసుకుని ఎగవేయడంతో ఆయనకు ఎర్రమంజిల్ కోర్టు శిక్ష విధించింది. బ్యాంక్ నుంచి ఆయన తీసుకున్న మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. దీనిపై ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కాగా, కొత్తపల్లి గీతకు కూడా శిక్ష విధించాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ వేసిన పిటిషన్ ను నాంపల్లి కోర్టు తోసిపుచ్చింది. విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు ఎండీగా వ్యవహరించిన రామకోటేశ్వరరావు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 2008 డిసెంబర్లో రూ. 25 కోట్లు లోన్ తీసుకున్నారు. బాకీ తీర్చేందుకు ఆయన ఇచ్చిన రూ. 25 కోట్ల రూపాయల చెక్ బౌన్స్ కావడం, పదే పదే నోటీసులు పంపినా స్పందించకపోవడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఆయనను దోషిగా తేల్చిన న్యాయస్థానం శిక్ష విధించింది. -
బోగస్ సర్టిఫికెట్తో ఎంపీ పదవి: వైఎస్సార్సీపీ
అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. పాడేరు ఎమ్మెల్యే గిద్ది ఈశ్వరి, రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరి ఫిర్యాదు చేశారు. ఎంపీ గీత సోదరుడు వివేకానందకుమార్ ఎస్టీ కాదన్న డీఎల్ఎస్సీ నివేదికపై ఈనెల 28వ తేదీన కలెక్టర్ విచారణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో గీత, ఆమె సోదరుడు గిరిజనులు కారని ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. అయితే, ఎంపీ గీత సోదరుడి కులం వ్యవహారాన్ని గిరిజన సంక్షేమ శాఖ చూసుకుంటుందని కలెక్టర్ వారికి చెప్పారు. కలెక్టర్ నీతూకుమార్ ప్రసాద్ సమాధానంతో ఎమ్మెల్యేలు రాజేశ్వరి, ఈశ్వరి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ గీత ఎస్టీ కాదన్న విషయాన్ని కప్పిపుచ్చేందుకు టీడీపీ సర్కారు కుట్రపన్నుతోందని ఈశ్వరి ఆరోపించారు. చంద్రబాబు కుట్రను గిరిజనులమంతా కలిసి ఎదుర్కొంటామని ఈశ్వరి చెప్పారు. బోగస్ సర్టిఫికెట్తో ఎంపీ పదవిని అనుభవిస్తూ గీత గిరిజనులను మోసం చేస్తున్నారని ఆమె అన్నారు. -
అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై వైఎస్సాఆర్ సీపీ ఫైర్
-
కొత్తపల్లి గీత గైర్హాజరుతో విచారణ వాయిదా!
విశాఖపట్నం: ఎంపి కొత్తపల్లి గీత గైర్హాజరవడంతో ఫోర్జరీ సంతకాలపై విచారణ వాయిదాపడింది. గత ఎన్నికలలో నామినేషన్ పత్రాలపై గీత ఫోర్జరీ సంతకాలు చేసినట్లు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఆదేశాల ప్రకారం జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఈరోజు విచారణ నిర్వహించారు. ఈశ్వరి, గిరిజనులు విచారణకు హారజయ్యారు. గీత హాజరుకాకపోవడంతో విచారణను వాయిదావేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈశ్వరి మాట్లాడుతూ కొత్తపల్లి గీత ఎన్నిక ప్రక్రియను అపహాస్యం చేసిందని విమర్శించారు. సభ్యత,సంస్కారం, ఆత్మగౌరవం ఉంటే ఎంపి పదవికి వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఫోర్జరీ చేసినవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈశ్వరి డిమాండ్ చేశారు. ** -
అనంతబాబుకు బెయిల్ మంజూరు
17న నియోజకవర్గానికి రాక రంపచోడవరం(గంగవరం) : వైఎస్సార్ పార్టీ యువజన విభాగ అధ్యక్షుడు, రంపచోడవరం నియోజకవర్గ కన్వీనర్ అనంత ఉదయభాస్కర్ (బాబు)పై అరకు ఎంపీ కొత్తపల్లి గీత పెట్టిన అక్రమ కేసులో నిజనిజాలు లేవని విశాఖ జిల్లా సెషన్స కోర్టు నమ్మి, ఆయనకు బెయిల్ మంజూరు చేసిందని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొమ్మిశెట్టి బాలకృష్ణ అన్నారు. శుక్రవారం రాత్రి ఆయన మాట్లాడుతూ పార్టీని దెబ్బతీసేందుకు కుట్రలు పన్నినా న్యాయమే గెలుస్తుందన్నారు. అక్రమ కేసులతో అణగదొక్కలేరన్నారు. అనంతబాబు ఈ నెల 17న నియోజకవర్గానికి రానున్నారని, ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఏజెన్సీ ముఖద్వారం అడ్డతీగల మండలం గొంటవానిపాలెం నుంచి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. -
గీత దాటితే..!
-
'పార్టీ మారితే వార్డు మెంబర్ గా కూడా గెలవలేదు'
విశాఖ: జిల్లాలోని అరకు నియోజకవర్గ సభ్యురాలు కొత్తపల్లి గీతపై పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తీవ్రంగా మండిపడ్డారు. ఒకపార్టీ నుంచి ఎంపీగా గెలిచిన ఆమె .. వేరే పార్టీతో చర్చలు జరపడాన్ని ఈశ్వరి తప్పుబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన అనంతరం మిగతా పార్టీలతో మంతనాలు జరపడం ఎంతవరకూ సమంజసం అని ప్రశ్నించారు. మంగళవారం మీడియాతో మాట్లడిన ఈశ్వరి.. ఎంపీ అభ్యర్థిగా ఉన్న గీత పార్టీ మారి ఎన్నికలకు వెళ్తే వార్డు మెంబర్ గా కూడా గెలవలేదన్నారు. కొత్తపల్లి గీత సోమవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయిన సంగతి తెలిసిందే. టీడీపీపీ నేత వై.సత్యనారాయణచౌదరి (సుజనాచౌదరి) వెంట ఆమె చంద్రబాబును కలిసేందుకు వెళ్లారు. దీనిపై వైఎస్సార్ సీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక పార్టీ నుంచి గెలిచిన అనంతరం వేరే పార్టీతో చర్చలు జరపడం సరైన చర్య కాదని మండిపడుతున్నారు. -
''వైస్సాఆర్ సీపీలోనే గిరిజనులకు పెద్దపీట''
-
చంద్రబాబుతో ఎంపీ గీత భేటీ
సాక్షి, హైదరాబాద్: విశాఖ జిల్లా అరకు నియోజవకర్గ లోక్‌సభ సభ్యురాలు కొత్తపల్లి గీత సోమవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. టీడీపీపీ నేత వై.సత్యనారాయణచౌదరి (సుజనాచౌదరి) వెంట ఆమె చంద్రబాబును కలిసేందుకు వెళ్లారు. చంద్రబాబుతో భేటీ అనంతరం ఎంపీ గీత ‘సాక్షి’తో మాట్లాడుతూ తన నియోజకవర్గం నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉందని, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అధికారులతో సమీక్షించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, స్థానికంగా పరిష్కరించాల్సిన అంశాలకు సంబంధించి తొమ్మిది పేజీల వినతిపత్రాన్ని తయారు చేసి ముఖ్యమంత్రికి అందచేశానని చెప్పారు. ఇదిలావుంటే కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డి సోమవారం లేక్‌వ్యూ అతిథిగృహంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. నంద్యాల ఎంపీ ఎస్.పి.వై.రెడ్డి, మాజీ మంత్రి టి.జి.వెంకటేష్ కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా కేశవరెడ్డిని చంద్రబాబు పార్టీలో చేర్చుకున్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
'చంద్రబాబు హామీలు నిలుపుకోవాలి'
విజయనగరం: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు నెరవేర్చాలని వైఎస్ఆర్ సీపీ సాలూరు ఎమ్మెల్యే పి.రాజన్నదొర డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేసినా.. తానేమీ దోచుకోలేదు... దాచుకోలేదని తెలిపారు. తానెప్పుడూ ప్రజాపక్షమే ఉంటానని చెప్పారు. రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తామని అరకు ఎంపీ కొత్తపల్లి గీత చెప్పారు. -
పార్టీని వీడను: కొత్తపల్లి గీత
-
జెయింట్ కిల్లర్... కొత్తపల్లి గీత!!
వైరిచర్ల కిశోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్... ఐదుసార్లు లోక్‌సభకు ఎంపికై, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ లాంటి అత్యున్నత నిర్ణాయక మండలిలో సభ్యత్వం ఉండి, కేంద్ర మంత్రిగా అపార అనుభవం సాధించిన నేత. జీవితంలో ఒక్కసారి కూడా ఓటమి అన్నది ఎరుగని ధీరుడు. అలాంటి ఉద్దండుడితో ఢీకొన్నప్పుడు కొత్తపల్లి గీతను అంతా కొండ.. పొట్టేలుతో పోల్చారు. కానీ, అంతటి గొప్ప రాజకీయ చరిత్ర ఉన్న కిశోర్ చంద్రదేవ్‌ను ఓడించి.. విశాఖ జిల్లా అరకు నుంచి లోక్‌సభలోకి ప్రవేశించడానికి సిద్ధమయ్యారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కొత్తపల్లి గీత. కురుపాం రాజా వైరిచర్ల దుర్గాప్రసాద దేవ్, రాజమాత శోభలతాదేవిల కుమారుడైన కిశోర్ చంద్రదేవ్ అంటే కాంగ్రెస్ అధిష్ఠానంలో కూడా మంచి పేరుంది. అలాంటి పెద్ద నాయకుడిని లోక్‌సభ ఎన్నికలలో ఓడించడం అంటే చిన్న విషయం కానే కాదు. కానీ, ఆ ఘనతను సాధించి చూపించి జెయింట్ కిల్లర్‌గా నిలిచారు.. కొత్తపల్లి గీత. గిరిజనులలో అట్టడుగు వర్గమైన వాల్మీక తెగకు చెందిన ఆమె కుటుంబం.. రాష్ట్రంలోనే మొట్టమొదటగా గ్రూప్-1 పట్టా పొందింది. గీత తండ్రి కొత్తపల్లి జాకోబ్ తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలానికి చెందినవారు. ఆయన బాటలోనే.. గీత కూడా గ్రూప్-1 సాధించారు. 2010 వరకు ప్రభుత్వ సర్వీసులలో ఉన్న ఆమె, స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి, సేవారంగంలోకి ప్రవేశించారు. గీతాస్ అనే స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటుచేసి, దాని ద్వారా నాలుగు జిల్లాల్లో ఉన్న గిరిజనుల అభ్యున్నతికి కృషి చేశారు. ఆమె సేవాభావాన్ని గుర్తించడంతో పాటు.. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ప్రజల అవసరాలు, సమస్యలను ఏమాత్రం పట్టించుకోని కిశోర్ చంద్రదేవ్‌కు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతోనే అరకు వాసులు గీతను తమ ఎంపీగా ఎన్నుకున్నారు. ఆమెకు మొత్తం 2,17,637 ఓట్లు వచ్చాయి. కిశోర్ చంద్రదేవ్‌కు కేవలం 20,507 ఓట్లు మాత్రమే రావడంతో కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. రెండోస్థానంలో టీడీపీ అభ్యర్థిని గుమ్మడి సంధ్యారాణి నిలిచారు. ఆమెకు 2,00,094 ఓట్లు వచ్చాయి. దాంతో గీతకు 17,543 ఓట్ల మెజారిటీ వచ్చినట్లయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తన మనసును కలచివేసిందని, ప్రజాసేవ పుణ్యం వల్లే ఆయన మరణానంతరం కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని గీత అన్నారు. అందుకే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. నాలుగు జిల్లాల్లో 40 సంస్కృతుల సమ్మేళనంగా ఉన్న అరకు నియోజకవర్గ అభివృద్ధికి కొత్త భాష్యం చెబుతానని, అన్నివేళలా అందుబాటులో ఉండి ప్రజాశ్రేయస్సుకు పాటు పడతానని హామీ ఇచ్చారు.