సాక్షి, కోడూరు : కృష్ణా జిల్లా కోడూరు మండలం చింతకోల్లలో చెలరేగిన స్వైన్ ఫ్లూ కలకలంపై కలెక్టర్ లక్ష్మీకాంతం స్పందించారు. చింతకోల్లలో సంభవించిన మరణాలు స్వైన్ ఫ్లూ వల్ల కాదని తేల్చిచెప్పారు. అనారోగ్యంతో, కార్డియాక్ అరెస్ట్ కారణంగానే వారు చనిపోయినట్లు తెలిపారు. గ్రామంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. గ్రామస్తులు, పాఠశాల విద్యార్థులను స్వైన్ ఫ్లూ నెపంతో ఇబ్బందులకు గురిచేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
శానిటేషన్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించామని, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామని తెలిపారు. త్రాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు. స్వైన్ ఫ్లూ వ్యాధి పట్ల గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మందుస్తు నివారణకు ఆర్సీనిక్ అల్బెమ్ హోమియో మందు ఇంటింటికి పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment