
కోడూరు: కృష్ణా జిల్లా కోడూరు మండలం చింతకొల్లలో స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. వారం రోజుల్లో స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఇద్దరు మృతిచెందడంతో గ్రామంలో వైరస్ వ్యాపించిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమాచారాన్ని గ్రామస్తులు ప్రభుత్వాధికారులకు తెలియడంతో వారు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
చుట్టు పక్కల ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలకు అనధికారికంగా సెలవులు కూడా ప్రకటించారు. ఆర్డీఓ ఆద్వర్యంలో గ్రామంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రజల ఆందోళన చెందకుండా ఉండేందుకు గ్రామంలో స్వైన్‌ప్లూపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోన్నారు.
Comments
Please login to add a commentAdd a comment