చెరువు పూడిక తీస్తూ ఉపాధి కూలీ మృతి చెందిన సంఘటన బుధవారం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో చోటు చేసుకుంది.
ఏలూరు : చెరువు పూడిక తీస్తూ ఉపాధి కూలీ మృతి చెందిన సంఘటన బుధవారం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... ఏపూరి వెంకటేశ్వరరావు (40) ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఆ క్రమంలో బుధవారం శ్రీరామవరంలో చెరువు పూడిక తీయడానికి వెళ్లిన వెంకటేశ్వరరావుకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి... వెంకటేశ్వరరావును ఇంటికి చేర్చారు. స్థానిక వైద్యుడిని పిలిచేందుకు కుటుంబ సభ్యులు వెళ్లారు. వైద్యుడు వచ్చేలోగానే వెంకటేశ్వరరావు మృతి చెందాడు.