వీడని గ్రహణం | leaving the eclipse of the modernization work | Sakshi
Sakshi News home page

వీడని గ్రహణం

Published Thu, Nov 14 2013 4:41 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM

leaving the eclipse of the modernization work

గద్వాల, న్యూస్‌లైన్: ఆర్డీఎస్ (రాజోలిబండ నీటి మళ్లింపు పథకం)ఆధునికీకరణ పనులకు గ్రహణం వీడటంలేదు. పంటకు నీళ్లం దక కడుపుమండి రైతులు ఆందోళన చేసిన సమయంలో ప రిశీలిస్తామని పలికే ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ తరువాత ఆర్డీఎస్ సమస్యను మరిచిపోవడం పరిపాటిగా మా రింది. పనులు పూర్తిచేయాల్సిన కర్ణాటక ఇన్నాళ్లూ కాల యాపనచేసి నాలుగునెలల క్రితం కాంట్రాక్టును రద్దుచేసిం ది. ఈ మేరకు జూరాల అధికారులకు నెలరోజుల క్రితం స మాచారం పంపించారు.
 
 కాగా, రద్దయిన టెండర్లకు కొత్త అంచనాలు రూపొందించి మన ప్రభుత్వ అనుమతికోసం నివేదికలు పంపించాల్సి ఉన్నా ఇప్పటివరకు కదలికలేదు. దీంతో ఈ వేసవిలో ఆర్డీఎస్ ప్యాకేజీ-2 పనులు ప్రారంభమయ్యే సూచనలేవీ కనిపించడం లేదు. ఇలాగే కాలయాపన జరిగితే వచ్చే ఖరీఫ్‌కు నీరందకపోవడంతో పాటు రబీ సీజన్‌ను కూడా రైతులు కోల్పోవాల్సి వస్తుంది. కేవలం రెండేళ్లలో పూర్తి కావాల్సిన ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు కర్ణాటక అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ముందుకుసాగడం లేదు. దీంతో ఆరేళ్లుగా రెండోపంట పండించకుండా ఆర్డీఎస్ ఆయకట్టు రైతాంగం నష్టపోతూనేఉంది. ఇంత జరుగుతున్నా ఆర్డీఎస్ సమస్యపై జిల్లా యంత్రాంగం సీరియస్‌గా స్పందించిన దాఖలాల్లేవు. కేవలం రూ.92కోట్ల వ్యయంతో ఆధునికీకరణ పనులు పూర్తి చేయించాల్సిన ప్రభుత్వం, ఆరేళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఆయకట్టు రైతాంగానికి ఏటా రెండోపంటకు నీటికష్టాలు తప్పడం లేదు.
 
 ఆర్డీఎస్ పనులు
 2006లో నిపుణుల కమిటీ ఆర్డీఎస్‌ను ఆదునికీకరణ చేయాల్సిందిగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ సిఫార్సుల మేరకు ప్రభుత్వం రూ.92 కోట్లను ఆధునికీకరణ కోసం 2007లో మంజూరుచేసింది. ఈ నిధుల్లో రూ.72 కోట్లతో కర్ణాటకలో, రూ.20 కోట్లతో మనరాష్ట్ర పరిధిలోని అలంపూర్ నియోజకవర్గంలో పనులకు ఖర్చుచేసే విధంగా టెండర్లు పిలిచారు. అయితే హెడ్‌వర్క్స్‌కు దిగువన ప్యాకేజీ-2లో ప్రధానకాల్వ ఆధునికీకరణ పనులను రూ.24 కోట్ల విలువతో సిరామట్ కన్‌స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ తీసుకున్నారు. గత వేసవి మార్చిలో కేవలం పనులను ప్రారంభించి వదిలేశారు. నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. దీంతో మనరాష్ట్ర ఉన్నతాధికారులు, జూరాల ఇంజనీర్లు ప్యాకేజీని రద్దుచేసి కొత్తగా టెండర్లు పిలవాలని కర్ణాటక ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చారు. పనులు చేయకుండా నిర్లక్ష్యం వహించిన ప్యాకేజీ -2 కాంట్రాక్టును రద్దుచేసేందుకు క ర్ణాటక ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతిచ్చింది.
 
 ప్యాకేజీల వారీగా పనులు
 ఆధునికీకరణ పనుల్లో భాగంగా 1వ ప్యాకేజీని ప్రభు కస్ట్రక్షన్స్ కంపెనీ రూ.3.30 కోట్లకు చేపట్టి పనులను గత వేసవిలో ప్రారంభించారు. నదికి వరద రావడంతో అసంపూర్తిగా నిలిచిపోయాయి. 2వ ప్యాకేజీ సిరామట్ కన్‌స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ స్వామి రూ.24 కోట్లతో చేపట్టి ఇప్పటివరకు కేవలం 30శాతం పనులను మాత్రమే పూర్తిచేశారు.
 
 3వ ప్యాకేజీ కాంట్రాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి రూ.24 కోట్లతో పనులు చేపట్టగా ఇప్పటివరకు 95 శాతం పూర్తయ్యాయి. 4వ ప్యాకేజీ కాంట్రాక్టర్ జయంత్‌రావు రూ.19 కోట్ల విలువతో మొత్తం పనులు పూర్తిచేశారు. 5వ ప్యాకేజీ (మన రాష్ట్ర పరిధి)లో కాంట్రాక్టర్ రత్న కన్స్‌స్ట్రక్షన్ రూ.నాలుగు కోట్లతో చేపట్టిన పనులు పూర్తయ్యాయి. ఇక 6వ ప్యాకేజీలో కాంట్రాక్టర్ జీఎస్‌ఆర్ రూ.14 కోట్ల పనులను చేపట్టారు. ఇప్పటికీ 80 శాతం పూర్తికాలేదు. 7వ ప్యాకేజీలో రూ.ఆరుకోట్లతో రత్న కన్స్‌స్ట్రక్షన్స్ కంపెనీ పనులు చేపట్టి ఇవి కూడా పూర్తికాలేదు. 8వ ప్యాకేజీలో కాంట్రాక్టర్ బీఎస్‌ఆర్ రూ.12 కోట్లతో పనులు చేపట్టగా 60 శాతం పనులు పూర్తయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement