సాక్షి, విజయవాడ : ఫెర్రీ ఘాట్ వద్ద కృష్ణా నదిలో పడవ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన మృత్యుంజయులు సాక్షితో మాట్లాడారు. ప్రైవేటు బోటులో భవానీ ఐలాండ్‌కు వెళ్లి వచ్చేందుకు రూ.300 చెల్లించినట్లు చెప్పారు. రక్షణ కోసం లైఫ్ జాకెట్లు అడిగితే ఈ బోటుకు లైఫ్ జాకెట్లు అవసరం లేదన్నారని వెల్లడించారు. ప్రమాదంలో మృతి చెందింది ఎవరో కూడా తమకు తెలియడం లేదని వాపోయారు.
ప్రాణాలతో ఉన్న వారిని ఏ ఆసుపత్రికి తరలించారో సమాచారం లేదని అన్నారు. ఫెర్రీ ఘాట్ వద్దకు రాగానే బోటు కుదుపులకు గురైందని తెలిపారు. భయంతో అందరూ బోటును గట్టిగా పట్టుకున్నామని చెప్పారు. మరోసారి కుదుపులు వచ్చాయని ఆ తర్వాత బోటు తిరగబడినట్లు తెలిపారు. వేరే బోటు వచ్చి తమను రక్షించిందని చెప్పారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కొందరికి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు.
విజయవాడలో ప్రభుత్వం ఈవెంట్లకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రజల రక్షణకు ఇవ్వడం లేదని మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల్లో 30 మందిని పొట్టనబెట్టుకున్నది మీకు సరిపోలేదా అంటూ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment