
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మూడో రోజు లాక్‌డౌన్ కొనసాగుతోంది. కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 31వరకు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో లాక్ డౌన్‌ను ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తోంది. పలు రహదారులు వాహనాలు లేక నిర్మానుష్యంగా మారాయి. మరోవైపు అత్యవసర వాహనాలుకు మాత్రమే అధికారులు అనుమతి ఇస్తున్నారు. అదేవిధంగా నిబంధనలు అతిక్రమించే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన వారు బయటకు వస్తే కేసులు పెడతామని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిత్యావసర కొనుగోలుకు ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే రావాలని ఆదేశించారు. మెడికల్ షాపులు, మెడిసిన్ మినహా.. నిత్యావసర వస్తువులు రాత్రి 8 గంటల తర్వాత విక్రయాలను నిషేధించారు. ప్రజలందరూ బాధ్యతాయుతంగా ఉండాలని స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ పాటించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. (పటిష్టంగా లాక్ డౌన్)
చదవండి: (ప్రభుత్వ నిర్ణయాలన్నీ అమలు కావాల్సిందే)