ఫైల్ ఫోటో
సాక్షి, అనంతపురం: కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలు లాక్‌డౌన్ అమలు చేయగా.. జనం పెద్దగా పట్టించుకోలేదు. దీంతో పోలీసులు నిబంధనలు ఉల్లంఘించే వారిపై లాఠీ ఝలిపించారు. కానీ పోలీసు చర్యలపై విమర్శలు వెల్లువెత్తగా, ఎస్పీ సత్యయేసుబాబు వెంటనే చర్యలు తీసుకున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లఘించిన వారిపై జరిమానాలు విధించాలని ఆదేశించారు. దీంతో వివిధ స్టేషన్ పరిధిలో పోలీసులు లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేసేందుకు ఫైన్లు, వాహనాల సీజ్‌కు శ్రీకారం చుట్టారు. (కబళించిన ఆకలి)
సెక్షన్ 188, 269 తదితర సెక్షన్ల కింద మొత్తం 347 కేసులు నమోదుచేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై మొత్తం 23,520 కేసులు నమోదు చేసి వారికి రూ.1,06,80,945 జరిమానా విధించారు. ఇక పేకాట ఆడుతున్న వారిపై 15 కేసులు నమోదు చేసి రూ,1,12,610 నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 100 లీటర్ల నాటుసారా, 250 లీటర్ల బెల్లంఊట, 20 టెట్రా ప్యాకెట్లు, 86 గుట్కా బండిళ్లు సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment