నాదెండ్ల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఘటన
నాదెండ్ల: మధ్యాహ్న భోజనం వికటించి 18 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటన మండల కేంద్రమైన నాదె ండ్ల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో జరిగింది. ప్రభుత్వం గతేడాది ఈ విద్యాలయాన్ని రూ.2కోట్ల వ్యయంతో నిర్మించి అదే ఏడాది ప్రారంభించింది. ఈ విద్యాలయంలో వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు 160 మంది ఉన్నారు. శనివారం మధ్యాహ్నం భోజనం చేసిన విద్యార్థినుల్లో 18 మందికి తీవ్రమైన కడుపునొప్పి, అనంతరం వాంతులు అయ్యాయి. ఏఎన్‌ఎం భారతి బాలికలకు ప్రాథమిక చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చేర్పించారు. వైద్యాధికారి డాక్టర్ ఆర్. గోపీనాయక్ అత్యవసర చికిత్సలు అందించారు. కల్తీ కందిపప్పు వల్లనే విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్టు వైద్యులు చెబుతున్నారు.
దుడ్డుబియ్యంలో పురుగులు వస్తున్నాయని, మూడురోజులుగా పప్పుతోపాటు మరో కూర వడ్డిస్తున్నారని విద్యార్థినులు చెప్పారు. సమాచారం తెలుసుకున్న క్లస్టర్ మెడికల్ ఆఫీసర్ కేవీఎన్ శివకుమార్, సూపర్ వైజర్ కె.శ్రీనివాసరావు, చంద్రశేఖర్ హస్పిటల్‌కు చేరుకుని విద్యార్థినులను పరామర్శించి వైద్యుల నుంచి వివరాలను సేకరించారు. అక్కడి నుంచి విద్యాలయానికి చేరుకుని ఆహార నమూనాలను సేకరించారు.
మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థినులకు అస్వస్థత
Published Sun, Jul 6 2014 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 AM
Advertisement
Advertisement