విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ) : తిరుపతి శ్రీ పద్మావతమ్మ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలోని ఎమ్మెస్సీ నర్సింగ్ సీట్లకు ఈ నెల 30న విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఏడాది ఆగస్టు 16న యూనివర్సిటీ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన మహిళా అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌కు అర్హులని చెప్పారు.
సీట్ మ్యాట్రిక్స్ వివరాలు కౌన్సెలింగ్‌కు ముందురోజు యూనివర్సిటీ నోటీసు బోర్డుతో పాటు వర్సిటీ (http://ntruhs.ap.nic.in) వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు వివరించారు. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 2 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 1500 చొప్పున చెల్లించి ఈ 30వ తేదీ ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు రూ. 9,700 యూనివర్సిటీ ఫీజు చెల్లించాలని చెప్పారు. మరిన్ని వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందవచ్చని తెలిపారు.
ఈ నెల 30న ఎమ్మెస్సీ నర్సింగ్ కౌన్సెలింగ్
Published Tue, Dec 22 2015 8:15 PM | Last Updated on Sun, Sep 3 2017 2:24 PM
Advertisement
Advertisement