
సాక్షి, విజయవాడ : మచిలీపట్నం=సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలుకు శనివారం పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం అర్ధరాత్రి కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లి వద్దకు రాగానే రైలు ఇంజన్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ స్టేషన్ వద్ద రైలును నిలిపివేసి అధికారులకు సమాచారం అందించాడు.
విషయం తెలుసుకున్న ఉంగుటూరు పోలీసులు దగ్గరలో ఉన్న వాటర్ ట్యాంక్ సాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఎంతకు మంటలు అదుపులోకి రాకపోవడంతో గన్నవరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దీంతో రైలులో ఉన్న ప్రయాణీకులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment