మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌కు బోగీ మిస్ | Machilipatnam Express coach to miss | Sakshi
Sakshi News home page

మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌కు బోగీ మిస్

Published Fri, Jan 30 2015 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM

మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌కు బోగీ మిస్

మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌కు బోగీ మిస్

హైదరాబాద్: రైల్వే అధికారుల తప్పిదం ఫలితంగా మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి గంటన్నర ఆలస్యంగా బయలుదేరింది. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో రైల్వే అధికారులు అదనపు బోగీ ఏర్పాటుకు నిర్ణయించారు. ఎస్‌సీ1 బోగీ పేరుతో 72 మంది ప్రయాణికులకు బెర్త్‌లను కేటాయించారు. గురువారం రాత్రి 10.30 గంటలకు బయలుదేరాల్సిన రైలు నిర్ణీత సమయానికే రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. అయితే అదనపు బోగీ కనిపించకపోవడంతో ప్రయాణికులు రైల్వే అధికారులతో వాగ్వాదానికి దిగారు. తప్పిదం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన అదనపు బోగీని ఏర్పాటు చేసి పంపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement