బందరు పోర్టు పనులకు భూసేకరణే అడ్డంగా మారిందని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ చెప్పారు.
బందరు పోర్టు పనులకు భూసేకరణే అడ్డంగా మారిందని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ చెప్పారు. మరో రెండు, మూడు నెలల్లోనే పోర్టు పనులు ప్రారంభిస్తామన్నారు.
తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి నుంచి మచిలీపట్నం వరకు జాతీయ రహదారి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని ఆయన అన్నారు. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలుస్తామని చెప్పారు.