
ఆంధ్రప్రదేశ్:
► నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత రేషన్ పంపిణీ, లాక్‌డౌన్‌లో పేదలకు అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వం
► లబ్ధిదారులకు 5 కిలోల చొప్పున బియ్యం, కేజీ శనగలు, రాష్ట్ర వ్యాప్తంగా 1,47,24,017 కుటుంబాలకు లబ్ధి
► ఇప్పటికే రేషన్ దుకాణాలకు చేరుకున్న సరుకులు, 14,315 రేషన్ షాపుల్లో అదనంగా కౌంటర్లు ఏర్పాటు
► నేటి నుంచి విజయవాడలో నిషేధాజ్ఞలు విధించినట్లు నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ఒక ప్రకటనలో తెలిపారు.
► రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 525కు చేరింది.
► ఇప్పటివరకు 20 మంది డిశ్చార్జి అయ్యారు.
► కరోనా వైరస్‌తో ఇప్పటి వరకు 491 మంది చికిత్స పొందుతున్నారు.
► ఇప్పటివరకు కరోనాతో 14 మంది మృతి చెందారు.
తెలంగాణ:
► కువైట్ అత్యవసర క్షమాభిక్ష
► కరోనా వ్యాప్తి నేపథ్యంలో వలసదారుల భారం తగ్గింకునేందుకే..
► నేటి నుంచి 20 వరకు భారత కార్మికుల దరఖాస్తుల పరిశీలన
► రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 650కి చేరింది.
►ఇప్పటివరకు 18 మంది మృతి చెందారు.
► ఇప్పటివవరకు కరోనా నుంచి 118 మంది కోలుకొని ఇంటికి వెళ్లారు.
జాతీయం:
► భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,370కు చేరింది.
► ఇప్పటివరకు 1508 మంది డిశ్చార్జ్ కాగా, 422 మంది మృతి చెందారు.
► ప్రస్తుతం భారత్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 10,440గా ఉన్నాయి.
అంతర్జాతీయం:
► ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21 లక్షలకు చేరింది.
► ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో 1.34 లక్షల మంది మృతి చెందారు.
► ప్రపంచ వ్యాప్తంగా 5.09 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు.