ఆడపిల్ల పుట్టిందని మనస్తాపానికి గురైన ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఆడపిల్ల పుట్టిందని మనస్తాపానికి గురైన ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రతి విషయానికి మానసికంగా కుంగి పోయే మల్లయ్య ఆడపిల్ల పుట్టిందనే బెంగతో ఉరి వేసుకున్నాడు. ఎస్‌ఐ చందర్‌రాథోడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన పల్లె మల్ల య్య (35)కు ఎనిమిదేళ్ల కొడుకు మధు ఉన్నాడు. 11 రోజుల కింద ఆడపిల్ల పుట్టింది. ఈ క్రమంలో మల్లయ్య బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి ఆడపిల్ల పుట్టింది ఎలా అంటూ విలపించాడు. శుక్రవారం రాత్రి బయటకు వెళ్లి, మండలంలోని లక్ష్మీరావులపల్లి గ్రామ శివారులో శవమై కనిపించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.