అధికారుల నిర్లక్ష్యంపై నిరసిస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల సబ్కలెక్టర్ కార్యాలయంలో శనివారం చోటుచేసుకుంది.
కరీంనగర్: అధికారుల నిర్లక్ష్యంపై నిరసిస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల సబ్కలెక్టర్ కార్యాలయంలో శనివారం చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా సుధాకర్ అనే వ్యక్తి పురుగుల మందుతాగా బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతన్ని పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడు పెగడపల్లి మండలం, నామాపూర్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.