వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న దిమ్మెను ఢీకొని వ్యక్తి మృతి చెందాడు.
అద్దంకి (ప్రకాశం): వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న దిమ్మెను ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం మేదరమెట్ల సమీపంలోని కొప్పారం మేజర్ కాలువ వద్ద ఆదివారం జరిగింది. వివరాలు.. నర్సరావుపేటలోని జ్యోతినికేతన్‌లో నివాసముంటున్న అనిల్ పాస్టర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదానికి గురై మృతిచెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.