
మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ శ్యామ్‌కుమార్, ఎస్సై వీరభద్రరావు
సాక్షి, పశ్చిమ గోదావరి : ఆస్తి కోసం కన్న తల్లినే కడతేర్చి కాటికి పంపించాడు ఓ కొడుకు. పున్నామ నరకాన్ని ఇంట్లోనే చూపించి వృద్ధాప్యంలో ఉన్న తల్లిని కర్కశంగా మెడపై కాలితో నులిమి, రోడ్డు పైకి ఈడ్చుకువచ్చి పారతో తలను ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు. వివరాల్లోకి వెళ్తే మండలంలోని చినకాపవరం గ్రామంలో నివసిస్తున్న ఎస్.సత్యవతి(70) తన కుమారుడు బంగారయ్య వద్దే ఉంటోంది. సత్యవతికి ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులున్నారు. ఇటీవల అరెకరం భూమి, ఇల్లు తన పేరున రాయాలని బంగారయ్య సత్యవతిని ఒత్తిడి చేస్తున్నాడు. ఆస్తి అందరికీ పంచుతానని సత్యవతి చెప్పడంతో ఆమెను చంపేస్తే మొత్తం ఆస్తి తనకే వస్తుందని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని భీమవరం రూరల్ సీఐ శ్యామ్ కుమార్ తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో పడుకుని ఉన్న సత్యవతిని బయటకు తీసుకువచ్చి పారతో తలపై బలంగా నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. మృతురాలి పెద్ద కుమార్తె వానపల్లి నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment