గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసులు నిర్వాకం మరోసారి బట్టబయలైంది.
గుంటూరు : గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసులు నిర్వాకం మరోసారి బట్టబయలైంది. ఇటీవల పట్టణంలో చోరీ జరిగింది. ఆ కేసులో అనుమానితుడిగా తిరుమలరావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అది అవమానభారంగా భావించిన తిరుమలరావు స్టేషన్లో ఆత్మహత్యకు యత్నించాడు. దాంతో అతడి పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతడిని తెనాలి ఆసుపత్రికి తరలించారు. తెనాలి ఆసుపత్రిలో తిరుమలరావు చికిత్స పొందుతున్నాడు.