చీరాల: పలు కేసుల్లో నిందితునిగా ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించగా... అక్కడి పోలీసుల కళ్లుగప్పి ఆ నిందితుడు గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా చీరాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. అదినారయణపురానికి చెందిన కావేటి పోలేరు, పద్మావతి దంపతులు గత నెల 27న చీరాల బస్టాండ్‌లో చోరీకి పాల్పడ్డారు.
ఈ కేసును విజయవంతంగా ఛేదించిన పోలీసులు దొంగ దంపతులను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. శనివారం ఉదయం నిందితుడు పోలేరు బాత్రూమ్కు వెళ్లి బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అతన్ని చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితునిపై ఆత్మహత్యకు పాల్పడినందుకు కూడా కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.