తన కుమార్తె పెట్టిన వేధింపుల కేసుపై పోలీసులు స్పందించటం లేదంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు.
పెంటపాడు: తన కుమార్తె పెట్టిన వేధింపుల కేసుపై పోలీసులు స్పందించటం లేదంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడులో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. పెంటపాడుకు చెందిన సింహాచలం కుమార్తె మీనా శిరీష వివాహం రెండేళ్ల క్రితం పరిమళ్ల గ్రామానికి చెందిన అట్టాడ వెంకటేశ్వరరావుతో జరిగింది. అయితే, కొన్నాళ్లకే అత్తింటి వారు మీనా శిరీషను పుట్టింట్లో వదిలేశారు. దీంతో ఆమె.. భర్త, అత్తింటి వారిపై వేధింపుల కేసు పెట్టింది. కేసు నమోదు చేసి ఏడాదైనా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదంటూ శుక్రవారం సింహాచలం ఎస్సై గుర్రయ్యను నిలదీశాడు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయటంతో వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగాడు. సింహాచలం పరిస్థితి విషమంగా మారటంతో తాడేపల్లిగూడెం తరలించారు.