గీతాపఠనం విజయానికి సోపానం | Manchu vishnu at Management of the dot from the Bhagavad Gita | Sakshi

గీతాపఠనం విజయానికి సోపానం

Published Sat, May 30 2015 5:03 AM | Last Updated on Sun, Sep 3 2017 2:54 AM

గీతాపఠనం విజయానికి సోపానం

గీతాపఠనం విజయానికి సోపానం

భగవద్గీతలోని 18 అధ్యాయాలు 18 సూత్రాలుగా మానవాళి విజయాలకు తోడ్పడుతున్నాయని కేఎస్‌ఎస్‌ఆర్‌మాజీ సంచాలకులు పంచముఖి అన్నారు.

చంద్రగిరి : భగవద్గీతలోని 18 అధ్యాయాలు 18 సూత్రాలుగా మానవాళి విజయాలకు తోడ్పడుతున్నాయని కేఎస్‌ఎస్‌ఆర్‌మాజీ సంచాలకులు పంచముఖి అన్నారు. టీటీడీ వారి సౌజన్యంతో   మండలంలోని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో గత రెండు రోజులుగా మేనేజ్ మెంట్ డాట్ ఫ్రం భగవద్గీత అనే అంశంపై జాతీయ సదస్సు జరుగుతోంది. ఇందులో భాగంగా రెండవ రోజైన శుక్రవారం భగద్గీతపై వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యానికేతన్ విద్యాసంస్థల సీఈవో, సినీనటుడు మంచు విష్ణు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఇస్కాన్ డెరైక్టర్ రేవతిరమణదాస్ మాట్లాడుతూ మానవజీవనప్రమాణాలకు సంబంధించిన అనేక అంశాలు భగవద్గీతలో వున్నాయన్నారు. మరో విశిష్ట అతిథిగా విచ్చేసిన  హిందూ దినపత్రిక రిటైర్డ్ ఎడిటర్ రామస్వామిసంపత్ మాట్లాడుతూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక శాస్త్రీయమైన మనస్తత్వం గల వ్యక్తిగా ఆయన అభివర్ణించారు. అనంతరం విద్యాసంస్థల సీఈవో మంచు విష్ణు మాట్లాడుతూ ఇంతమంది వ్యక్తులు ఈ కార్యక్రమానికి రావడం భగవద్గీతపై ప్రసంగించడం ఆనందంగా వుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి డి.గోపాలరావు, సంస్థ డెరైక్టర్ మోహన్, గురునాధనాయుడు, శ్రీనివాసరావు, విద్యావేత్తలు, అధ్యాపకులు, పరిశోధనా విద్యార్థులు ,కార్పొరేట్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement