విశాఖలో మావోయిస్టు లేఖల కలకలం | maoists letter tells AOB bandh | Sakshi
Sakshi News home page

విశాఖలో మావోయిస్టు లేఖల కలకలం

Published Sun, Dec 6 2015 8:22 PM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM

maoists letter tells AOB bandh

విశాఖపట్నం: విశాఖలోని జి.మాడుగులలో మావోయిస్టుల లేఖలు కలకలం సృష్టించాయి. ఆంధ్రా-ఒడిషా సరిహద్దు(ఏవోబీ) స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ చంద్రమౌళి పేరుతో లేఖలు రాశారు. ప్రజల ఆగ్రహంపై నీళ్లు చల్లేందుకే జీవో నం.97 ఉపసంహరణ నాటకం ఆడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. అడవిపై హక్కుల కోసం ఆయుధాలు పట్టండంటూ మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ నెల 21 నుంచి 27 వరకు నిరసన వారంగా తమ లేఖ ద్వారా ప్రకటించారు. 26న ఏవోబీ బంద్కు మావోయిస్టులు పిలుపిస్తున్నట్లు తమ లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement