భార్యపై ఉన్న అనుమానం ఓ భర్తను కర్కోటకుడిని చేసింది. జీవితాంతం తోడుగా నిలవాల్సిన అతడు నిద్రిస్తున్న సమయంలో ఆమె గొంతునులిమి దారుణంగా హత్య చేశాడు. ఆపై ఆత్మహత్య చేసుకుందని స్థానికులను నమ్మించేందుకు యత్నించాడు.
శెట్టూరు : అనుమానంతో భార్యను హత్య చేసిన ఘటన పేరుగుపాళ్యం గ్రామంలో జరిగింది. శెట్టూరు ఎస్‌ఐ వెంకటరమణ కథనం ప్రకారం.. కర్నాటకలోని వదినకల్లుకు చెందిన వీరభద్రప్ప, లక్ష్మీదేవికి మొదటి సంతానం గొల్ల రాధ (24). ఆమెను పేరుగుపాళ్యం గ్రామానికి చెందిన యర్రగుంటప్ప, కరియమ్మ రెండవ కుమారుడు గొల్ల చిత్తయ్యకు ఇచ్చి ఐదు సంవత్సరాల క్రితం వివాహం చేశారు. వీరి మధ్య మొదటి నుంచి గొడవలు జరుగుతున్నారుు. పోలీసులు, గ్రామ పెద్దలు పలుమార్లు పంచారుుతీ చేశారు.
భార్య అదే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో శుక్రవారం రాత్రి రాధ గొంతు నులిమి చింతయ్య హత్య చేశాడు. ఆపై విద్యుత్ వైరు పట్టుకుని ఆత్మహత్య చేసుకుందని నమ్మిం చేందుకు ప్రయత్నించాడు. కరెంట్ వైరు ఆమె చేతిలో పెట్టాడు. విషయం తెలుసుకున్న రాధ తల్లిదండ్రులు గ్రామానికి చేరుకున్నారు. అనుమానంతో తమ బిడ్డ ప్రాణాలు తీశారని బోరున విలపించారు.
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ వేణుగోపాల్, తహశీల్దార్ వాణీశ్రీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహానికి తహశీల్దార్ వాణీశ్రీ, వీఆర్వో క్రిష్టప్ప పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇన్‌చార్జి సీఐ భాస్కర్‌రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత దారుణ హత్య
Published Sun, Nov 23 2014 3:20 AM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM
Advertisement
Advertisement