శనివారపుపేట (ఏలూరు రూరల్) : ఏలూరు మండలం శనివారపుపేటలో శుక్రవారం ఓ మహిళ చంటిపిల్లను ఒళ్లో పెట్టుకుని కిరోసిన్¯ డబ్బా, అగ్గిపెట్టె పట్టుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంటానంటూ ఆందోళనకు దిగడం కలకలం రేపింది. గ్రామస్తులంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో ప్రధాన డ్రెయినేజీ అభివృద్ధి చేసేందుకు పాలకవర్గం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా మరడాని రమణ ఇంటి ముందు సిబ్బంది తవ్వకాలు చేపట్టారు.
తమ స్థలంలో డ్రెయినేజీ నిర్మించడాన్ని నిరసించిన ఆమె డ్రెయినేజీ నిర్మాణ పనులు అడ్డుకునేందుకు మనుమరాలిని చేతపట్టుకుని పనులు ఆపకపోతే కిరోసిన్ పోసుకుని అంటించుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ బైఠాయించింది. దీంతో సిబ్బంది పనులు నిలిపేశారు. పంచాయతీ పాలకవర్గం ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మహిళా పోలీస్ అందుబాటులో లేకపోవడంతో ఆమెను అదుపులోకి తీసుకోలేక వెనుదిరిగారు.
దీనిపై ఇన్‌చార్జి సర్పంచ్ సూరత్తు నారాయణ మాట్లాడుతూ ఆక్రమణకు గురైన డ్రైయినేజీ స్థలంలో రాళ్లు, మట్టి తొలగించామన్నారు. అయినప్పటికీ బాధిత మహిళ అడ్డుకుంటోందని తెలిపారు. డ్రైయినేజీ ఆక్రమణ వల్ల మురుగునీరు పారుదల కాకపోవడంతో సమస్యలు వస్తున్నాయని చెప్పారు. గతంలోనే పాలకవర్గం ఆ మహిళకు వివరించినప్పటికీ వినడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment